Lionel Messi | మెస్సీ కీలక నిర్ణయం.. ఫుట్‌బాల్‌కు బ్రేకిచ్చిన దిగ్గజం..!
Lionel Messi : ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరిసిన మెస్సీ లియోనల్ మెస్సీ (Lionel Messi) తన తండ్రి జార్జ్ మెస్సీ మరణంతో విషాదంలో కూరుకుపోయాడు. కొన్నిరోజులు ఆటకు విరామం ప్రకటించాడు.
Lionel Messi : ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరిసిన మెస్సీ లియోనల్ మెస్సీ (Lionel Messi) తన తండ్రి జార్జ్ మెస్సీ మరణంతో విషాదంలో కూరుకుపోయాడు. తాను ప్రపంచం గర్వించదగ్గ ఫుట్‌బాలర్ అవ్వడానికి కారణమైన తండ్రి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న మెస్సీ.. కొన్నిరోజులు ఆటకు విరామం ప్రకటించాడు. అయితే.. అతడు మళ్లీ పునరాగమనం ఎప్పుడు చేస్తాడు? అనేది తెలియాల్సి ఉంది.
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి నుంచి తేరుకోకముందే తండ్రి జార్జ్ మెస్సీ మరణంతో కుంగిపోయాడు లియోనల్ మెస్సీ. గుండెపోటుతో జార్జ్ 68 ఏళ్లకే కన్నుమూయడం సాకర్ దిగ్గజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తండ్రి అంత్యక్రియల కోసం అర్జెంటీనా చేరుకున్న మెస్సీ.. తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే తదనంతర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. దాంతో, కొన్ని రోజులు ఆటపై దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడంతో మెస్సీ విరామం ప్రకటించాడు. కొన్ని రోజులు మెస్సీ మైదానంలో దిగడు అని స్పానిష్ వార్తపత్రిక మర్కా వెల్లడించింది.
🚨 Lionel Messi has decided to remain in Argentina INDEFINITELY as he spends time with his loved ones during this difficult family period. 🇦🇷❤️
There is currently NO date set for his return to the United States, and it remains unclear when Messi will play for Inter Miami again.… pic.twitter.com/jbH2mA2Kv0
— Transfer News Live (@DeadlineDayLive) August 11, 2026
తండ్రి మరణవార్త తెలియగానే తమ సొంత పట్టణం రొసారియాకు ప్రైవేట్ విమానంలో వెళ్లాడు మెస్సీ. ఈ వారంలో జార్జ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాంతో.. ఇంటర్ మియామి క్లబ్ యాజమాన్యం మెస్సీకి కావాల్సినన్ని రోజులు సెలవులు మంజూరు చేసింది. అతడు తిరిగి స్క్వాడ్‌లో చేరాలనుకునేంత వరకూ అర్జెంటీనాలోనే ఉండేందుకు అనుమతిచ్చింది ఇంటర్ మియామి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

