Jupally krishna Rao | ముందు మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. మంత్రి జూపల్లిని నిలదీసిన సర్పంచ్.. వీడియో
Jupally krishna Rao | మీకు వేరే ఊళ్లు అవసరం లేదు.. ముందు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఫస్ట్ మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. పల్లెలను చూసుకోండి.. సార్ అంటూ మంత్రి జూపల్లికి రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ సూచించారు.
Jupally krishna Rao | వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. మీరు ఊరికి రాకపోవడం.. గ్రామాల్లో తిరగకపోవడం.. మీకు వేరే ఊళ్లు అవసరం లేదు.. ముందు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఫస్ట్ మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. పల్లెలను చూసుకోండి.. సార్ అంటూ మంత్రి జూపల్లికి సూచించారు.
నేను మీకు ఫోన్ చేస్తున్నా కానీ మీ పీఏలు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు నేను కార్యకర్త మాత్రమే.. కానీ ఈ రోజు నేను 1500 మంది జనాభా ఉన్న గ్రామానికి సర్పంచ్ను. మీరు ఫోన్లు వాళ్ల దగ్గర పెడ్తరు. మా బాధలేంటో చెప్పుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. తండాకు రోడ్లు దరిద్రంగా ఉన్నాయని.. సమస్యలు చెబుదామంటే పీఏలు ఫోన్లు ఎత్తడంలేదని, మీరు మళ్లీ ఊరికి ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు.
మంత్రి జూపల్లిని ప్రజలు, అధికారులందరి ముందే సర్పంచ్ ప్రభాకర్ నిలదీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేరు ఊర్లు తర్వాత ముందు నీ సొంత ఊరు సంగతి చూడండి
మీ పీఏలు నా ఫోన్లు ఎత్తడం లేదు
మంత్రి జూపల్లి ముందు సర్పంచ్ ఆవేదన
వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
ఈ నేపథ్యంలో వేరే ఊర్ల సంగతి తర్వాత ముందు… pic.twitter.com/vscKgG6v97
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026
Read Also :
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

