NTR: ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..!

సెలబ్రిటీలు బ్రాండ్ల విషయంలో ఏ మాత్రం తగ్గరు. వారు వాడే వాచి దగ్గర నుండి ప్రయాణాలు చేసే కార్ల వరకు ప్రతీది కూడా రిచ్‌గానే ఉండేలా చూసుకుంటూ ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్‌కి వాడే కాస్ట్లీ వస్తువుల గురించి నిత్యం నెట్టింట చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఆయన ధరించే మాస్క్, బ్లేజర్, షూల గురించి సోషల్ మీడియాలో చర్చ జరగ్గా..ఇప్పుడు వాచ్ గురించి చర్చ నడుస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో జరిగిన ప్రెస్‌మీట్స్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ స్టైలిష్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఆయన చేతికి ఉన్న వాచ్ గురించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో భాగంగా ఎన్టీఆర్ రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ ధరించాడు.
ఈ వాచ్ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు(5,14,800 డాలర్లు) ఉంటుందట. ఈ విషయం తెలిసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ డబ్బుతో ఏకంగా ఇళ్లు కట్టేసుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. కాగా, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదలవుతుంది. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఇంకా అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Pintop1
- RRR
- tollywoood
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

