Rajamouli: ఆర్ఆర్ఆర్ చిత్రానికి బీజం ఎలా పడిందో చెప్పిన రాజమౌళి

ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చర్చ నడుస్తుంది. జనవరి 7న ఈ సినిమా విడుదల కానుండగా, చిత్రంకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఆర్ఆర్ఆర్ మూవీ టీం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ అలియా భట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చింది.ఈ క్రమంలో రాజమౌళి అసలు ఆర్ఆర్ఆర్కి ఎలా బీజం పడిందో చెప్పుకొచ్చాడు. ఓ రోజు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకి కాల్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడట. ముందుగా ఎన్టీఆర్.. జక్కన్న ఇంటికి రాగా, ఆ తర్వాత రామ్ చరణ్ వచ్చాడు. అయితే చెర్రీ, ఎన్టీఆర్ ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారట.
ఇంటికి వచ్చే వరకు రాజమౌళి ఏ విషయం వాళ్లకు చెప్పలేదట. ఇంటికి వచ్చాక మీ ఇద్దరితో సినిమా చేస్తున్నాను అని రాజమౌళి అనగా, ఫస్ట్ షాక్ అయిన వారు మూవీ చేసేందుకు ఆసక్తి చూపించారట. ఇద్దరు హీరోలకు ముందుగా ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పిన చెప్పిన రాజమౌళి ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమా కథను, పాత్రల గురించి వివరించాడట. ఆ రకంగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందింది.
గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ …ఆర్ ఆర్ఆర్ చిత్రంలో నటిస్తుండగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్లో ‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్. ఇక పులి ఎదురుగా ఎన్టీఆర్ మొహం పెట్టి గట్టిగా అరవడం మరో హైలైట్ గా చెప్పవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Rajamouli
- ram charan
- rrr movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

