RRR ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్ రాకపోవడానికి కారణమేంటి..?

Rajamouli | ట్రైలర్ విడుదల తర్వాత ఇప్పుడు దేశమంతా రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలైన తర్వాత అవి ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. తెలుగు సినిమాతో మొదలై ఇప్పుడు ఇండియన్ సినిమాను శాసిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అలాంటి ఒక కాంబినేషన్ వస్తుందని అభిమానులు.. చేస్తామని హీరోలు కూడా ఎప్పుడూ అనుకొని ఉండరు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు జక్కన్న.

ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ముందుకు రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, డీవీవీ దానయ్య వచ్చారు. అందులో రామ్ చరణ్ మిస్ అయ్యాడు. దాంతో సోషల్ మీడియాలో అప్పుడే ప్రశ్నల వర్షం మొదలైంది. కావాలని మెగా వారసుడిని సైడ్ చేస్తున్నారా.. బాలీవుడ్ మీడియా అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ లో ఎందుకు రామ్ చరణ్ లేడు.. సమాధానం చెప్పండి అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వైపు రాజమౌళి పక్షపాతం చూపిస్తున్నాడు అంటూ ఏకంగా అభిమానులు కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు.

అయితే ఇవన్నీ కేవలం రామ్ చరణ్‌పై ఉన్న ఇష్టంతోనే చేస్తున్నారు అంటూ ట్రిపుల్ ఆర్ టీం కూడా లైట్ తీసుకుంది. అయితే రామ్ చరణ్ ఎందుకు ఈ ప్రెస్ మీట్‌కు రాలేదనే ప్రశ్నకు రాజమౌళి నుంచి సమాధానం వచ్చింది. ఉపాసన చెల్లెలు అనుష్పలా వివాహం ఈ మధ్యే జరిగింది. ఉపాసన చెల్లి అంటే రామ్ చరణ్ కు స్వయానా మరదలు. ఆమె పెళ్లి కోసం కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చిన్న పూజ ఉంటే చరణ్ దంపతులు అక్కడే ఆగిపోయారు. అదే రోజు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ కూడా విడుదలైంది. దాంతో ఈ ప్రెస్ మీట్ కు దూరంగా ఉన్నాడు రామ్ చరణ్. అంతే తప్ప ఇంకే కారణాలు లేవు అని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి నుంచి సినిమా విడుదల ఎంత వరకు జరిగే ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో హీరోలు ఇద్దరు వస్తారు అని చెప్పాడు దర్శక ధీరుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rajamouli About RRR Hero | ‘ఆర్ఆర్ఆర్’ హీరో ఎవరో చెప్పిన రాజమౌళి
Rajamouli: మీ రెస్పాన్స్ చూసి మా టీమ్ అంతా చాలా ఆనందంగా ఉంది: రాజమౌళి
RRR సినిమా విడుదలకు ముందు మూడు ప్రధానమైన ఈవెంట్స్ ఇవే..
RRR: ఈ రెండు ఫ్రేములు చాలు.. అభిమానుల ఆనందం రెట్టింపు కావడానికి..!
RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. యుద్ధం తెల్లదొరలపై కాదు, బాక్సాఫీస్‌పై..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

