భారతీయ సినీ ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 7న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, గ్లింప్స్ వీడియోలతోపాటు ఇటీవలే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. జక్కన్న శుక్రవారం ఓ చిట్‌చాట్ సెషన్లో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఈ సినిమాకు హీరో ఎవరని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా..స్వేచ్చ ఆలోచనే (Thought of freedom) ఈ చిత్రానికి హీరో అని చెప్పాడు జక్కన్న. మనం స్వతంత్రంగా ఉండాలని, మనల్ని మనమే పాలించుకోవాలనే ఆలోచనే స్వేచ్చ ఆలోచనని చెప్పుకొచ్చాడు. అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) రోల్ గురించి స్పందిస్తూ..ఆర్ఆర్ఆర్ సినిమాపై అజయ్ దేవ్గన్ పాత్ర చాలా ప్రభావం చూపిస్తుందన్నాడు. అసలు ఈ సినిమాకు మూలం ఈ పాత్ర నుంచే ఉద్భవించిందని..ఈ పాత్రను మీ మనస్సుల్లో నుంచి తీసేయడం అంత సులభమైంది కాదని అన్నాడు.
‘సాంప్రదాయంగా రాంచరణ్ (Ramcharan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)లు సూపర్‌స్టార్ కుటుంబాలకు చెందిన వారని..ఇద్దరి అభిమానులకు పోటీ అనే ఫీలింగ్ ఉంటోంది. ఇద్దరిని నటింపజేసి సినిమా తీయడం సవాల్‌గా మారింది. అయితే పోటీ మినహాయిస్తే వీరిద్దరూ మంచి స్నేహితులు..ఈగోలు లేవు. వారిద్దరి స్నేహం తెరపై మార్చబడింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?