సారా అలీఖాన్ (Sara Ali Khan)కి ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఇంతకీ అంత స్పెషల్ ఏంటనుకుంటున్నారా..? స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా కేదార్ నాథ్ (Kedarnath) సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. 2018 డిసెంబర్ 7న విడుదలైన కేదార్ నాథ్ నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. సారా అలీఖాన్ ‘ముక్కు’ (Mukku) పాత్రలో నటించి మిలియన్ల మంది మనసు దోచుకుంది. తన నటనా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది సారా అలీఖాన్.
‘3 సంవత్సరాల క్రితం నా అతిపెద్ద కల నిజమైంది. నేను యాక్టర్ అయ్యా. నా మొదటి, అత్యంత ప్రత్యేకమైన సినిమా కేదార్ నాథ్ విడుదలైంది. కేదార్నాథ్ అంటే అర్థమేంటో నేను ఎప్పుడైనా వివరించగలనో లేదో నాకు తెలియదు.కానీ కేదార్ నాథ్ అంటే నాకు ఆ స్థలం, సినిమా, జ్ఞాపకాలు. ఈ రోజు నిజంగా నా మన్సూర్‌ని మిస్ అవుతున్నా. సుశాంత్ సింగ్ రాజ్‌పుథ్ సపోర్టు, నిస్వార్థంగా నాకు చేసిన సహాయం, నిరంతర మార్గదర్శకత్వం, మంచి సలహా కారణంగానే ‘ముక్కు’ మీ హృదయాలను చేరుకోగలిగింది.
కేదార్నాథ్ నుండి ఆండ్రోమెడ వరకు..సుశాంత్ నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నా. రొన్నీ స్క్రూవ్ వాలా (Ronnie Screwvala ) మీ విజన్ నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. జై బోలేనాథ్ ప్రపంచాన్ని సృష్టించినందుకు కేదార్ నాథ్లో గర్వపడే పాత్ర చేసినందుకు సంతోషంగా పీలవుతున్నానని’ పోస్టు పెట్టింది సారా అలీఖాన్.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్