టాలీవుడ్ (Tollywood) యాక్టర్ రాంచరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ తోపాటు సంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరుస్తుంటుంది. ఉపాసన 9 ఏండ్ల క్రితం వేసుకున్న లెహెంగా కాస్ట్యూమ్స్ (lehenga outfit) సీన్ ను మళ్లీ రీ క్రియేట్ చేసింది. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా..ఉపాసన సోదరి అనుష్పాల కామినేని వెడ్డింగ్ నేపథ్యంలో ఉపాసనను ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా (Anamika Khanna) పోచమ్మ పండుగ ఔట్ఫిట్లో మెరిసిపోయేలా రెడీ చేసింది.
ఎంతో సౌకర్యవంతమైన దుస్తులను రిపీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ భూమ్మీద క్వాంటిటీ కన్నా నాణ్యమైన షాపింగ్ ఉత్తమమైనదని నమ్ముతా. దుస్తులు అందించే బావోద్వేగ పూరిత క్షణాలు వెలకట్టలేనివి అంటూ ఉపాసన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఇక ఉపాసన డ్రెస్సింగ్ పై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. చాలా అందంగా ఉన్నావంటూ కితాబిచ్చింది. మీ ఆలోచనలు చాలా స్ఫూర్తివంతంగా ఉంటాయి..అని సింధు శ్రీనివాసులు అనే నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశారు.
ఉపాసన ట్రెడిషినల్ వేర్లో కనిపిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. చెన్నైకి చెందిన కారు రేసర్ అర్మాన్ ఇబ్రహీంను అనుష్పాల పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇండియా మాజీ ఎఫ్ చాంపియన్ అక్బర్ ఇబ్రహీం కొడుకు అర్మాన్. ప్రస్తుతం ఉపాసన ఇంట్లో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్