నెట్టింట్లో చాలా యాక్టింగ్ ఉండే బాలీవుడ్ (Bollywood) తారామణుల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది సారా అలీఖాన్ (Sara Ali Khan). ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటుంది. ఇక ఓటీటీ పాపులర్ స్టార్లలో ఒకడు విక్రాంత్ మెస్సీ (Vikrant Massey). గతేడాది విక్రాంత్ మెస్సీ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఓటీటీ స్టార్ అయిపోయాడు విక్రాంత్.
ఈ యువ హీరో ఇపుడు అందాల తార సారా అలీఖాన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేశాడన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. టిప్స్ ఫిలిమ్ లో సారా, విక్రాంత్ మెరువనుండగా..త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట ఈ ప్రాజెక్టు. ఓటీటీ మూవీస్ చేస్తున్న విక్రాంత్ కు ఇది పెద్ద ఆఫరే అని చెప్పాలి. విక్రాంత్ మెస్సీ ఈ ఏడాది తాప్సీతో కలిసి హసీనా దిల్‌రుబ చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి.
సారా అలీఖాన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్ తో కలిసి అట్రాంగీ రే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్రాంత్ మెస్సీ ప్రస్తుతం లవ్ హాస్టల్, ముంబైకర్, యార్ జిగిరీ ఫోరెన్సిక్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
KondaPolam poster | వైష్ణవ్‌తేజ్, రకుల్ కెమిస్ట్రీ సూపర్..స్టన్నింగ్ లుక్ ఔట్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ