మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల కు ఫుల్ టైం వినోదాన్ని అందించడంలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకు సిద్దంగా ఉంది. కాగా మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న గాడ్ ఫాదర్ (Godfather) సెట్స్ పై ఉంది. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వేదాళమ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక బాబీ (Bobby) దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ ను వాల్తేరు శీను (Waltair Seenu) గా మార్చినట్టు ఓ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రం సెట్స్ పై వెళ్లగానే సినిమా టైటిల్ పై అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు టాక్. వాల్తేరు శీనుగా చిరంజీవి తనలోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నాడట.
డైరెక్టర్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీని సెట్ చేస్తూ..కథానుగుణంగా కమర్షియల్ హంగుల మేళవింపుతో ఈ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తవగానే బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!