RRR events | కేవలం తెలుగు సినిమా ప్రేక్షకుల మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా ఆడియన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్న ట్రిపుల్ ఆర్ ట్రైలర్ విడుదలైంది. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత తెలుగు సినిమా పవర్ అంటే ఏంటో మరోసారి నిరూపించారు రాజమౌళి అని అంతా అనుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా కూడా పూర్తి స్థాయిలో సత్తా చూపించలేకపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించిన కూడా పునర్వైభవం అయితే ఇప్పటి వరకు రాలేదు. ఈ లోటు తీర్చడానికి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చేస్తుంది. అందుకే టీజర్, ట్రైలర్లో కూడా బ్రింగింగ్ బ్యాక్ ఇండియన్ సినిమా గ్లోరీ అంటూ వేశారు. అంటే ఇండియన్ సినిమాకు పునర్వైభవం తీసుకొచ్చే సినిమా ఇదేనని దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు.
ఇదిలా ఉంటే జనవరి 7న RRR సినిమా విడుదల కానుంది. రాబోయే నెల రోజులు పూర్తిగా ప్రమోషన్ కోసమే కేటాయించారు దర్శకుడు రాజమౌళి. అందులో భాగంగా సినిమా విడుదలకు ముందు మూడు ప్రధానమైన ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో మొదటిది ప్రీ రిలీజ్ ఈవెంట్.. రెండోది హిందీ ఈవెంట్.. మూడోది అత్యంత ప్రధానమైనది సినిమా విడుదలకు వారం రోజుల ముందు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 15న వరంగల్‌లో ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే 25న ముంబైలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అభిమానుల సమక్షంలో భారీగా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ఏపీ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మూడు వేల మంది అభిమానులు ప్రత్యేక ట్రైన్లో ముంబై తీసుకెళ్లనున్నారు. ఇక చివరగా జనవరి 1 లేదా 2వ తేదీల్లో హైదరాబాద్ లో అత్యంత వైభవంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు ఈవెంట్స్ తర్వాత సినిమా విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 15 వేలకు పైగా థియేటర్స్‌లో ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కానుంది. తెలుగులో సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chiranjeevi: ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై చిరంజీవి స్టన్నింగ్ రియాక్షన్
RRR: ఈ రెండు ఫ్రేములు చాలు.. అభిమానుల ఆనందం రెట్టింపు కావడానికి..!
RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. యుద్ధం తెల్లదొరలపై కాదు, బాక్సాఫీస్‌పై..!
RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల.. అరాచకం అంటే ఇలా ఉంటుందంటూ ట్వీట్ల వర్షం
Pooja Hegde: రామ్ చరణ్, ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్స్ చూసి షాకైన పూజా హెగ్డే.. కామెంట్ ఏంటంటే..!