RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల.. అరాచకం అంటే ఇలా ఉంటుందంటూ ట్వీట్ల వర్షం

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. పలు వాయిదాల తర్వాత ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ ను ప్రదర్శించారు. మరి కొద్ది సేపట్లో యూట్యూబ్ లో సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తారు.
థియేటర్స్‌లో విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసి అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. అరాచకం అంటే ఇలా ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలలో ఒదిగిపోయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ నిడివి 3 నిమిషాల 7 సెకెన్లు ఉన్నట్టు తెలుస్తుంది.
ఆర్ఆర్ఆర్ లో భారీ యాక్షన్ మాత్రమే కాదు, హై-డోస్ ఎమోషన్స్ కూడా ఉంటాయనే విషయాన్ని ముందునుంచి చెబుతూ వస్తోంది యూనిట్. ట్రైలర్లో ఎమోషనల్ కంటెంటే ఎక్కువగా ఉండబోతోందట. చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన విజువల్ తో పాటు సినిమా కథపై కూడా ఈ ట్రైలర్‌తో చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈరోజు ముంబయి, హైదరాబాద్ లో ప్రెస్ మీట్స్ ఏర్పాటుచేస్తున్నారు. ఫస్ట్ ప్రెస్ మీట్ ముంబయిలోనే. బెంగళూరు, చెన్నైలో రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటాయి. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- rrr movie
- RRR Trailer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

