Pooja Hegde: రామ్ చరణ్, ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్స్ చూసి షాకైన పూజా హెగ్డే.. కామెంట్ ఏంటంటే..!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దే కామెంట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్దే చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.అత్యంత పవర్ ఫుల్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలకు రాజమౌళి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్ని కూడా చాలా వేగంగా మొదలుపెట్టారు. మరికొద్ది రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 9 న ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాపై బజ్ క్రియేట్ చేసేలా చిత్ర బృందం రీసెంట్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల క్రేజీ లుక్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి.
ఈ పోస్టర్స్ పై హీరోయిన్ పూజా హెగ్దే ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రాజమౌళి చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్ ని చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తానని పేర్కొంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయని, వీరిద్దర్ని స్క్రీన్ పై చూడాలని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నానని.. తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. పూజా హెగ్దే చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

