Chiranjeevi: ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై చిరంజీవి స్టన్నింగ్ రియాక్షన్

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో బాలీవుడ్ నటి ఆలియాభట్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్.. తారక్‌కు జంటగా నటించారు. ద సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ , కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నభూతో నభవిష్యత్ అనేలా ఉంది.
ట్రైలర్‌పై సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ పై రివ్యూ ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ భీబత్సం.. ఇక ప్రభంజనం కోసం వచ్చే జనవరి 7 వరకు ఎదురు చూస్తుంటాను అని తనదైన శైలి రియాక్షన్ అందించారు. చిరంజీవి తన పవర్ ఫుల్ రియాక్షన్ ని ఎంతో ఎగ్జైటింగ్‌గా చెప్పడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. రాజమౌళి సర్.. ట్రైలర్ చూస్తుంటే మతిపోతోంది అంటూ కరణ్ జోహార్ కామెంట్ చేశారు. ట్రైలర్ చూస్తే గర్వంగా ఉందని విజయ్ దేవరకొండ అన్నారు.
RRR Trailer బీభత్సం …ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 9, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

