RRR: ఈ రెండు ఫ్రేములు చాలు.. అభిమానుల ఆనందం రెట్టింపు కావడానికి..!

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. గత మూడేళ్లుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రౌద్రం రణం రుధిరం అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి.
స్టోరీ టెల్లర్ మాస్టర్ రాజమౌళి తనదైన శైలిలో ట్రైలర్ కట్ చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ప్రతి ఫ్రేములో అద్భుతంగా చూపించాడు. పులితో ఎన్టీఆర్ ఫేస్ టు ఫేస్ గర్జన చూపించిన ఫ్రేమ్ ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పాలి. గతంలో ఎన్నో యాక్షన్ సీన్స్‌లో నటించి తనకు తిరుగులేదని అనిపించిన ఎన్టీఆర్ ఈ సీన్‌తో గూస్బంప్స్ తెప్పించాడు. ఇక అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్ర కూడా మరో లెవల్లో ఉంది.
ట్రైలర్ లో చరణ్.. 2 షేడ్స్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్ గా ఓ షేడ్ అయితే.. అల్లూరి సీతారామరాజుగా మరో షేడ్ లో.. అదరగొట్టాడు. మంటల్లోంచి బయటికి వచ్చే సీన్ గురించి అయితే.. అసలు మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. చూసి ఎంజాయ్ చేయాల్సిందంతే. ట్రైలర్ ద్వితియార్థంలో వచ్చే పోరాట సన్నివేశాలు అబ్బరుపరిచేలా ఉన్నాయి. దీనికి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిచ్చింది.
ట్రైలర్ చివర్లో విల్లు పట్టుకుని తెల్ల దొరలపై పోరాటం చేస్తున్న రామరాజు.. తన బలంతో శత్రువులను చిత్తు చేస్తున్న కొమరం భీంతో ‘ఈ నక్కల వేట ఎంతసేపు… కుంభస్థలాన్ని కొడదాం పదా’ అంటూ చెప్పే డైలాగ్ గూస్బమ్స్ తెప్పిస్తుంది. ఇద్దరూ కలిసి చేసే పోరాట ఘట్టాలు అద్భుతంగా ఉన్నాయి. జెండాలని పట్టుకుని చేతులు కలుపునే సీన్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఇద్దరు హీరోలు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- ram charan
- RRR Trailer
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

