ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ జనవరి 7న థియేటర్స్ లో భీబత్సం సృష్టించడానికి సిద్ధమవుతుంది. చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో నిన్న మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ అదరగొట్టారు. అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు , గూస్ మాస్ తెప్పించే ఎలివేషన్స్ సీన్స్ ,ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్‌లోని ప్రతి సీన్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. అయితే ట్రైలర్‌కి నలుమూలల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి రాజమౌళి ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని మరచిపోతున్నారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ కి అన్ని చోట్ల నుండి వస్తున్న రెస్పాన్స్ పట్ల మాటలు లేవు అని అన్నారు. ఇంకేమి చెప్పలేను, మా టీమ్ అంతా చాలా ఆనందం గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.