ఆలియా భట్‌తో నటించడానికి తారక్ కంగారుపడ్డాడా?

NTR about alia bhatt | ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశంలోని యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. పైగా ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. దీంతో జక్కన్న తీస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ వేయికళ్లతో వేచి చూస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. ప్రెస్మీట్లు పెట్టి మరి అభిమానులతో దర్శకధీరుడు ఇంట్రాక్షన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆలియాభట్‌తో నటించడంపై ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు ఎన్టీఆర్.

తాజాగా విడుదలై ట్రిపుల్ ఆర్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో శనివారం చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలియాభట్‌ను మొదటిసారి సెట్లో చూసినప్పుడు ఫీలింగ్ ఏంటని విలేకరులు ఓ ప్రశ్న అడిగారు. దీనికి రామ్ చరణ్, తారక్ ఇద్దరూ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆలియాతో నటించడానికి తారక్ టెన్షన్ అయ్యాడని అసలు విషయం బయటపెట్టాడు రామ్ చరణ్. ఆలియాతో ముందుగా తారక్ సన్నివేశాలు షూట్ చేశారు. అప్పటికీ చాలా రోజులు నాకు, ఎన్టీఆర్‌కు మధ్య షూటింగ్ జరిగింది. దీంతో చాలా రోజుల తర్వాత హీరోయిన్‌తో షూటింగ్ అనే సరికి తారక్ టెన్షన్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో లీనమైపోయా కాబట్టి ఆలియాతో సరదాగా మాట్లాడలేకపోయా అని తన గురించి చెప్పుకొచ్చాడు చరణ్. ఆలియా మంచి నటి అని అందరికీ తెలుసు.. ఆమె స్థాయికి సరిపోయేలా నటించాలని అనుకున్నట్లుగా చెప్పాడు. ఆలియాతో నటించేందుకు నిజంగానే ఎంతో ఇబ్బంది పడ్డానని ఎన్టీఆర్ కూడా చెప్పుకొచ్చాడు. ఆలియా నటనకు నేను సెట్ కాగలనా లేదా అని కంగారుపడ్డానని చెప్పాడు. ఈ విషయాన్ని ఆలియాభట్ కూడా గుర్తు చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మహేష్ సినిమాపై రాజమౌళికి ప్రశ్న.. స్పందన ఏంటో తెలుసా?
RRR ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్ రాకపోవడానికి కారణమేంటి..?
NTR: ఇక ఇదే చివరి సారి అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం..!
RRR సినిమా విడుదలకు ముందు మూడు ప్రధానమైన ఈవెంట్స్ ఇవే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- NTR
- Rajamouli
- Ramcharan
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

