బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందా? ఇది దుర్మార్గం అంటూ బ్రహ్మానందం రియాక్షన్

Brahmanandam reaction on Samantha Item song | పుష్ప సినిమాలో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత తన కెరీర్లో తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్ కావడంతో ఈ పాట వినేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఈ సాంగ్ రిలీజయ్యాక.. ఇందులోని లిరిక్స్ పురుషులను కించపరిచేలా ఉందంటూ వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అంతేకాదు ఈ సాంగ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి.
ఒకవైపు యూట్యూబ్‌లో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో పేరడీ పాటలు, మీమ్స్ కూడా తెగ వైరల్‌గా మారాయి. ఈ పాటకు ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాపా అంటూ మేల్ వర్షన్ సాంగ్‌తో పాటు పలు వర్షన్లలో పేరడీ పాటలు వచ్చేశాయి. ఇవే కాకుండా ఈ పాటలో సమంత వేసిన స్టెప్పులపై మీమ్స్ కూడా తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సమంత వేసిన ఒక స్టెప్పు.. బ్రహ్మనందం గతంలో పెట్టిన ఒక ఫోజుకు దగ్గరగా ఉంటుంది. దీంతో మా బ్రహ్మానందం స్టైల్‌ను కాపీ కొట్టకండి సామ్ అంటూ ఒక మీమ్ క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన బ్రహ్మానందం ఈ మీమ్‌పై స్పందించారు. నేను ఎప్పుడు పాతికేండ్ల క్రితం అలా అన్నాను.. ఇప్పుడు దాన్ని సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం అని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha: సమంత స్పెషల్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..!
Samantha | పుష్పలో సమంత ఐటెం సాంగ్‌పై రష్మిక రియాక్షన్ ఏంటి?
ఆ కమెడియన్ చనిపోయే ముందు నన్ను చూస్తానన్నాడు.. బ్రహ్మానందం ఎమోషనల్..
Brahmanandam reaction on Samantha Item song | బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందా? ఇది దుర్మార్గం అంటూ బ్రహ్మానందం రియాక్షన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

