ఆ కమెడియన్ చనిపోయే ముందు నన్ను చూస్తానన్నాడు.. బ్రహ్మానందం ఎమోషనల్..

Brahmanandam | తెలుగు ఇండస్ట్రీ అల్ టైమ్ గ్రేట్ కమెడియన్స్‌లో బ్రహ్మానందం అందరికంటే ముందుంటాడు. ఈ తరం ప్రేక్షకులకు, ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా కూడా బ్రహ్మానందం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. ప్రత్యక్షంగా ఆయన కనిపించకపోయినా మీమ్స్ రూపంలో ఎప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాడు బ్రహ్మానందం. అయితే కమెడియన్స్ జీవితమంటే కేవలం నువ్వు మాత్రమే కాదు ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. తాజాగా ఆలీతో సరదాగా షో కి వచ్చిన బ్రహ్మానందం తనలోని ఆ కోణాన్ని ఆవిష్కరించాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. వయస్సు సహకరించడం లేదు అంటూ అసలు నిజం ఒప్పుకున్నాడు. తనకు అవకాశాలు రావడం లేదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.. కానీ వచ్చిన అవకాశాలను కూడా తానే వదిలేస్తున్నాను అనే విషయం వాళ్లకు తెలియదు అంటున్నాడు బ్రహ్మీ.
రెండేళ్ల కింద బ్రహ్మానందానికి హార్ట్ ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి సినిమాల సంఖ్య బాగా తగ్గించాడు బ్రహ్మానందం. ఇంట్లో వాళ్లు కూడా విశ్రాంతి తీసుకోవాలని ప్రెజర్ పెట్టడంతో కొన్ని సినిమాలకు మాత్రమే సైన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కోట్లాదిమందిని నవ్వించే బ్రహ్మానందానికి నచ్చిన కమెడియన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.
ఈ ప్రశ్నకు ఎమ్మెస్ నారాయణ అనే సమాధానం చెప్పాడు బ్రహ్మానందం. తనకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎమ్మెస్ అని.. అతడిలో కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఒక మంచి విద్యావేత్త ఉన్నాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఆయన చనిపోయే ముందు జరిగిన సన్నివేశం గురించి కూడా గుర్తు చేసుకున్నాడు బ్రహ్మానందం. హాస్పిటల్లో ఎమ్మెస్ చావుబతుకుల మధ్యలో ఉన్నప్పుడు.. ఒక పేపర్ పెన్ తీసుకొని బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అంటూ రాసి తన కూతురుకు చూపించాడని తెలిపాడు.
ఆమె తనకు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే షూటింగ్ మధ్యలో ఆపుకొని కిమ్స్ హాస్పిటల్ కి వచ్చినట్లు చెప్పాడు బ్రహ్మానందం. తాను వచ్చిన తర్వాత.. తన చేతిలో చెయ్యేసి అలా ఒకసారి కిందికి పైకి చూసి పక్కనే ఉన్న తన కొడుకును తనను మరోసారి చూసి కన్నీరు పెట్టుకున్నాడని చెప్పాడు. తనకు అక్కడ ఉండి ఎమ్మెస్ నారాయణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయిందని.. తాను అలా హాస్పిటల్ బయటికి వచ్చిన 15-20 నిమిషాల వ్యవధిలోనే ఎమ్మెస్ చనిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా గుర్తు ఉంది అంటున్నాడు బ్రహ్మానందం. 2017 జనవరి 23న ఎమ్మెస్ నారాయణ కన్నుమూశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Brahmanandam memes | మీమ్స్ కా బాప్ బ్రహ్మానందం..వారికి బ్రహ్మీ ధన్యవాదాలు
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?
ఉ అంటావా.. ఊ అంటావా.. పుష్పలో సమంత సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..
Akhanda: అఖండ సినిమాని ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారా..!
Allu Arjun: పుష్ప టీమ్ మెంబర్స్‌కి బంగారు రింగ్‌లను బహుమతిగా ఇచ్చి బన్నీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

