Vishwak sen tested positive for COVID19 | కరోనా వైరస్ మళ్లీ టాలీవుడ్‌పై తన సత్తా చూపిస్తుంది. మెల్లమెల్లగా మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తనకు పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తనను కలిసిన అందరూ వెంటనే వెళ్లి టెస్టులు చేసుకోవాలని కోరాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో మరో హీరో కూడా ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. ఆయనెవరో కాదు విశ్వక్సేన్.
ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్, హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తనకు పాజిటివ్ వచ్చిన సంగతి సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఈ హీరో. దురదృష్టవశాత్తూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నానని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని.. మాస్కు తప్పనిసరిగా ధరించాలి అంటూ ఆయన కోరుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన తమకు కరోనా రాదు అనే అపనమ్మకం వద్దు అని.. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని సూచించాడు విశ్వక్ సేన్. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లు వెంటనే వెళ్లి టెస్టులు చేసుకోవాలని ఆయన కోరారు. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరిలోనూ తెలియని కంగారు మొదలైంది.
Hero @VishwakSenActor tested positive for #COVID19.
— Vamsi Kaka (@vamsikaka) December 31, 2021
He Requested everyone to Mask up and stay safe.#VishwakSen pic.twitter.com/EIplfbsA9K
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే..
మా స్టోరీస్ మావే..రైటర్స్ గా యంగ్ హీరోలు
ఇద్దరు యువ హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?
హిట్ 2 అందుకే వదిలేశా.. అసలు కారణం చెప్పిన విశ్వక్ సేన్
Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!