అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే..
By Maduri Mattaiah

mythri movie makers | కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాదిలో అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా భారీగానే నష్టాలను చవిచూసింది. థియేటర్లు మూతపడటంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల చేశారు. అయితే ఇంత కరోనా కష్టకాలంలో కూడా తమ సినిమాలను విడుదల చేసి లాభపడ్డ నిర్మాతలు ఉన్నారు.
కరోనా మొదటి వేవ్ తగ్గిన తర్వాత 2021 ఫిబ్రవరిలో మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ ఉప్పెన థియేటర్లో విడుదలై ఘనవిజయం సాధించింది. దాదాపు 100 కోట్లు వసూలు చేసి ఈ చిత్రం మైత్రీ మూవీస్ అధినేతలకు భారీ లాభాలను సాధించిపెట్టింది. అయితే ఉప్పెన విడుదలైన మూడు వారాలకే మళ్లీ కరోనా సెకండ్‌వేవ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో మరోసారి మైత్రీమూవీస్ సంస్థ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కూడా రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం రూ.45 కోట్లకు పైగా వసూలు చేసి కేజీఎఫ్‌ను దాటేసింది.
తాజాగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమ్రికాన్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఢిల్లీలో థియేటర్లు, ఫంక్షన్‌హాల్స్ మూసివేసినట్లుగా ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలు అయితే 50 శాతం ఆక్యుపెన్సీకి మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఈసారి కూడా కరోనా ప్రతికూల పరిస్థితి నుంచి మైత్రీ మూవీస్ నిర్మాతలు బయటపడ్డారని అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. పుష్స విడుదల ఒకవారం ఆలస్యమైనా పరిస్థితి మరోలా ఉండేదని,అంతేకాదు 2021లో ఉప్పెన, పుష్పల రూపంలో రెండు భారీ విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు మైత్రీ మూవీస్ నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సీక్రెట్‌గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

