సీక్రెట్‌గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్

Music Director Imman Divorce | సమంత, నాగచైతన్య తర్వాత మరో జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ తన భార్య మోనికా రిచర్డ్‌తో విడిపోయినట్లు ప్రకటించారు. 13 ఏండ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ప్రకటించారు. కానీ తన భార్య నుంచి ఎందుకు విడిపోయాడో మాత్రం వెల్లడించలేదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. వీరిద్దరూ 2020లోనే విడాకులు తీసుకున్నారు . కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం గమనార్హం.
నా శ్రేయోభిలాషులకు, సంగీతప్రియులందరికీ కృతజ్ఞతలు. నా భార్య మోనికా రిచర్డ్‌తో 2020 నవంబర్‌లో విడిపోయా. ఇద్దరం పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు మేం భార్యాభర్తలం కాదు. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా మా శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులతో పాటు మీడియా అందరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నా. మీ మద్దతుకు నా ధన్యవాదాలు అంటూ ఇమ్మాన్ సోషల్ మీడియాలో తన విడాకుల గురించి తెలిపారు. 2008 ఏప్రిల్‌లో మోనికా రిచర్డ్‌ను డి.ఇమ్మాన్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వెరోనికా డోరతి ఇమ్మాన్, బ్లెస్సికా క్యాథీ ఇమ్మాన్.

కోలీవుడ్‌లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో డి.ఇమ్మాన్ ఒకరు. తలపతి విజయ్ హీరోగా 2002లో వచ్చిన తమిళన్ సినిమాతో ఇమ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన రజినీకాంత్ చిత్రం అన్నాత్తే (పెద్దన్న)కు ఈయనే మ్యూజిక్ అందించాడు. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa | దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Nora Fatehi | దిల్బర్ గర్ల్ నోరా ఫతేహికి కరోనా పాజిటివ్
బుర్ఖాలో థియేటర్‌కి వచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసా స్పెషాలిటీ ఏంటి? ఉపాసన కంటే ముందు భారత్‌లో ఎవరికి వచ్చింది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

