యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసా స్పెషాలిటీ ఏంటి? ఉపాసన కంటే ముందు భారత్‌లో ఎవరికి వచ్చింది?
UAE Golden visa | రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అరుదైన గౌరవం అందుకుంది. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రమంలో ఇంతకీ గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఆ వీసా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఉపాసన కంటే ముందు దీన్ని ఎవరు అందుకున్నారు? వంటి విషయాలు ఒకసారి చూద్దాం..

యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసా ప్రత్యేకత ఏంటి?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ)లో ఎలాంటి ఆంక్షలు లేకుండా దీర్ఘకాలికంగా నివసించేందుకు గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుంటారు. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయడం మొదలైంది. ఈ లాంగ్‌టర్మ్ వీసాలకు 5, 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత అవే రెన్యువల్ అవుతాయి. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు.. ఇలా వివిధ రంగాల వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలను అందిస్తుంది. ఈ వీసాతో యూఏఈ పౌరులుగా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే వంద శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.
ఉపాసన కంటే ముందు గోల్డెన్ వీసా వచ్చింది వీరికే..
యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డెన్ వీసాను భారత్ నుంచి సినీ ప్రముఖుల్లో మొదటగా షారుఖ్‌ఖాన్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ ఫ్యామిలీ , నేహా కక్కర్, సింగర్ సోనూ నిగమ్ ఈ వీసాను పొందారు. ఈ వీసాను అందుకున్న తొలి తమిళ కథానాయికగా త్రిష రికార్డుకెక్కింది. ఆమె తర్వాత అమలాపాల్ ఈ వీసాను పొందింది. మలయాళ ఇండస్ట్రీ విషయానికొస్తే మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఈ వీసా అందుకున్న మొదటి వ్యక్తిగా ఉపాసన నిలిచారు. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
యూఏఈ నుంచి ఉపాసనకు గోల్డెన్ వీసా.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్
Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

