Upasana Recieves UAE Golden visa | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు అరుదైన గౌరవం లభించింది. అపోలో సంస్థల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నఆమెకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి గోల్డెన్ వీసా లభించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందికి మాత్రమే ఈ గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన గౌరవం మెగాస్టార్ చిరంజీవి కోడలికి దక్కింది. ఇక టాలీవుడ్ సెలబ్రెటీల్లో ఈ వీసా పొందిన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ ఆనందాన్ని ఉపాసన సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ఈ క్రిస్మస్ నాడు అసాధారణమైన బహుమతి అందుకున్నా.. యూఏఈ గోల్డెన్ వీసా దక్కడం చాలా ఆనందంగా ఉంది. నేనిప్పుడు గ్లోబల్ సిటిజన్. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని ట్వీట్ చేశారు.
యూఏఈ గోల్డెన్ వీసా ప్రత్యేకత ఏంటి?
దీర్ఘకాలిక నివాస వీసా కోసం యూఏఈ 2019లో కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా విదేశీయులు ఎటువంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో నివసించడానికి, చదువుకోవడానికి, పనిచేసుకోవడానికి వీలు ఉంటుంది. గోల్డెన్ వీసాకు 5 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితిని యూఏఈ అందిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే రెన్యువల్ అవుతుంది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, పరిశోధకులు, వైద్యనిపుణులు, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో ఉన్న వ్యక్తులు, విశేష ప్రతిభ కలిగిన వ్యక్తులు, విద్యార్థులు ఈ వీసాకు అర్హులు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్
Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..