Nidhhi Agerwal comments on Power star Pawan Kalyan | తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైన సరైన హిట్ అందుకోలేకపోతున్నది నిధి అగర్వాల్. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తప్ప ఈమె ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. అయినప్పటికీ ఈమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్‌బాబు మేనల్లుడు హీరోగా వస్తున్న హీరో సినిమా అవ్వగా.. రెండోది పవన్‌కళ్యాణ్‌తో హరిహరవీరమల్లు సినిమా. ఇప్పుడు నిధి ఆశలన్నీ వీటిపైనే ఉన్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఆశపడుతున్నది. ఈ క్రమంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై, ఆయనతో నటించడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్ చేసినవి తక్కువ సినిమాలే అయినా.. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు చేరువగా ఉంటుంది. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో ఆస్క్నిధి అని అభిమానులతో చిట్‌చాట్ సెషన్ పెట్టింది. అందులో చాలామంది పవన్ కళ్యాణ్‌తో హరిహరవీరమల్లు సినిమాలో నటించడంపైనే ప్రశ్నలు అడిగారు. వాటికి ఏ మాత్రం విసుక్కోకుండా సమాధానమిచ్చింది నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్‌తో నటించడం తన అదృష్టం. ఆయన వన్‌మ్యాన్ ఆర్మీ.. దేవుడి ఆశీస్సులు కలిగిన వ్యక్తి పీకే సార్ అని పవర్‌స్టార్‌ను పొగిడేసింది. ఈ ఇస్మార్ట్ బ్యూటీ చెప్పిన జవాబుతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు. మొత్తానికి ఈ కామెంట్స్ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా 2022లో విడుదల కానుంది. మరి ఈ సినిమా అయినా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి..
My most favourite and terrific performer.. one man army and blessed by god.. PK sir 🤍 #AskNidhhi https://t.co/gsoEAmyR6V
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్
Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..