RRR Release Date | బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై తరణ్ ఆదర్శ్ స్పందించారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్పై ఒక క్లారిటీ ఇచ్చారు.
చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లకు జనాలు రావడం మొదలైంది. అఖండ, పుష్ప సినిమాలు తీసుకొస్తున్న కలెక్షన్లను చూసి మిగిలిన నిర్మాతలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. కానీ మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో థియేటర్లు మూతబడ్డాయి. మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో డిసెంబర్ 31న విడుదల కావాల్సిన జెర్సీ సినిమా వాయిదా పడింది. దీంతో ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉందని సోషల్మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ స్పందించారు. ట్రిపుల్ ఆర్ వాయిదా పడటం లేదని.. అనుకున్న తేదీకే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రాజమౌళి తనతో చెప్పినట్లు ఒక ట్వీట్ చేశారు.
#Xclusiv… BREAKING NEWS… 'RRR' VERY MUCH ON 7 JAN 2022… SS RAJAMOULI OFFICIAL STATEMENT TO ME… No postponement. #SSRajamouli #JrNTR #RamCharan #RRR #RRRMovie #RRRPreReleaseEvent #RoarOfRRRInKerala pic.twitter.com/DmHdvp986U
— taran adarsh (@taran_adarsh) December 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
ram charan about chiru advice | నాన్న ఏం సలహా ఇచ్చాడో చెప్పిన రాంచరణ్
ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ పరిస్థితేంటి.. ముంబైలో గడ్డు పరిస్థితులు..!
RRR and Radhe shyam | ఆ విషయంలో రాజమౌళిని బీట్ చేసిన ప్రభాస్..