ఆ విషయంలో రాజమౌళిని బీట్ చేసిన ప్రభాస్..

Prabhas Radhe shyam | సినిమా తీయాలన్నా.. తీసిన సినిమాను ఆడియన్స్‌కు చేరువ చేయాలన్నా.. థియేటర్స్ నుంచి వెళ్లిపోయే వరకు కలెక్షన్స్ సునామీ సృష్టించేలా చేయాలన్నా తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి( Rajamouli )కి తెలిసినట్లు మరెవరికి తెలియదనే చెప్పాలి. అందుకే ఆయన సినిమాల విషయంలో మాస్టర్ అయిపోయాడు. మూడు నాలుగేళ్లకో సినిమా చేసినా కూడా రాజమౌళి సినిమా వస్తుందంటే అంతా అటెన్షన్ అయిపోతారు. ఇప్పుడు కూడా ఈయన చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా మరో రెండు వారాల్లోనే విడుదల కానుంది. జనవరి 7న ఈ చిత్రం రానుంది. దీనికోసం దేశమంతా తిరిగి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు రాజమౌళి. తన టీమ్‌ను కూడా అన్నిచోట్లకు తెగ తీప్పేస్తున్నాడు.
క్షణం తీరిక లేకుండా ట్రిపుల్ ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు దర్శకధీరుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు జరిగిన బిజినెస్ పూర్తిగా వెనక్కి రప్పించాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఏపీలో టికెట్ రేట్లు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ యూనిట్. అయితే ఒక్క విషయంలో మాత్రం రాజమౌళిని ప్రభాస్ బీట్ చేశాడు. రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ తీసుకున్న నిర్ణయంపై అంతా షాక్ అయ్యారు.. భలే ఐడియాతో వచ్చాడే అనుకుంటున్నారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత అంతా ఇదే చర్చించుకుంటున్నారు. సినిమా కోసం అన్ని రాష్ట్రాలు, ఇండస్ట్రీలు తిరిగి ప్రమోట్ చేసుకుంటున్నాడు జక్కన్న. కానీ ప్రభాస్ మాత్రం అందర్నీ ఒకే దగ్గరికి చేర్చాడు.
తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి మీడియాతో పాటు అభిమానులను కూడా హైదరాబాద్ రప్పించాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి ప్రభాస్ అభిమానులు వచ్చారు. దాంతో ప్రభాస్ తో పని చేయబోతున్న దర్శకులంతా వచ్చారు. దేశమంతా తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు ప్రభాస్. ఈ ఒక్క విషయంలో మాత్రం రాజమౌళిని తన తెలివితో బీట్ చేశాడు ప్రభాస్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Naveen Polishetty | రాధే శ్యామ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత తీసుకున్నాడో తెలుసా..?
Radhe Shyam Satellite rights | హాట్ టాపిక్‌గా రాధేశ్యామ్ శాటిలైట్ రైట్స్
ట్రిపుల్ ఆర్తో పాటు ఆ సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
Prabhas: నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Prabhas
- radhe shyam
- Rajamouli
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

