రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
సినిమాకు దర్శకుడే ప్రాణం ! తన ఆలోచనలో నుంచి పుట్టిన కథను.. ఎదుటివారి మనసులో నిలిచిపోయేలా తీసేందుకు ఎంతో కష్టపడుతాడు. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా మారి 24 క్రాఫ్ట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించేందుకు ఇంకెంతో శ్రమిస్తాడు.

సినిమాకు దర్శకుడే ప్రాణం ! తన ఆలోచనలో నుంచి పుట్టిన కథను.. ఎదుటివారి మనసులో నిలిచిపోయేలా తీసేందుకు ఎంతో కష్టపడుతాడు. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా మారి 24 క్రాఫ్ట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించేందుకు ఇంకెంతో శ్రమిస్తాడు. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో చాలామంది సినిమాల్లోకి వచ్చి దర్శకులుగా సత్తా చాటారు. కొంతమంది చదువు మానేసి సినిమాల్లోకి వస్తే.. మరికొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ.. వాటిని పక్కనబెట్టి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మన తెలుగు డైరెక్టర్లు ఏం చదివారో ఒకసారి చూద్దాం..

రాజమౌళి
బాహుబలి సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు మన రాజమౌళి. ఛత్రపతి, బాహుబలి వంటి అద్భుత సినిమాలు తీసిన జక్కన్న ఏం చదివారో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన చదివింది కేవలం ఇంటరే. బాహుబలి సినిమా విడుదల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివాడు. ఆయన గోల్డ్ మెడలిస్ట్ కూడా. విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం మ్యాథ్స్, సైన్స్ టీచర్‌గా పనిచేశాడు.

సుకుమార్
లెక్కలు, క్యాల్క్యూలేషన్స్ గురించి సుకుమార్ సినిమాల్లో మనం చాలాసార్లే చూసుంటాం. ఆయన లెక్కల మాస్టర్‌గా పనిచేసి వచ్చారని కూడా చాలామందికే తెలిసిందే. సుకుమార్ మ్యాథమేటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత కాకినాడలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు.

పూరీ జగన్నాథ్
హీరోలను మాస్ యాంగిల్లో చూపించాలంటే పూరీ జగన్నాథ్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు వంటి హిట్స్ ఇచ్చిన పూరీ.. బీఎస్సీ డిగ్రీలో ఫెయిల్ అయ్యాడు.

శేఖర్ కమ్ముల
ప్రేమకథలు, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు తీయడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట. ఎక్కువగా లవ్‌స్టోరీలు తీసే ఈయన సీబీఐటీలో బీటెక్ మెకానికల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హావర్డ్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఏ చదివాడు.

శ్రీకాంత్ అడ్డాల
ఫ్యామిలీ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈయన ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివాడు.

దేవా కట్టా
వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి విభిన్న సినిమాలు చేసిన దేవా కట్టా మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. అమెరికాలోని మిచిగాన్‌లో ఎం.ఎస్. కూడా చేశాడు. ఆ తర్వాత వెహికిల్ క్రాష్ ఇంజినీర్‌గా కూడా కొంతకాలం పనిచేశాడు.

క్రిష్ (జాగర్లమూడి రాధాక్రిష్ణ)
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు దర్శకుడు క్రిష్. ఈయన బీఫార్మసీ చదివాడు. అనంతరం న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

కొరటాల శివ
చేసింది తక్కువ సినిమాలే అయినా.. తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు కొరటాల శివ. ఈయన బీటెక్ చదివాడు.

అవసరాల శ్రీనివాస్
క్రేజీ సినిమాల దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ప్రిన్స్టన్ ప్లాస్మా ఫిజిక్స్ ల్యాబ్‌లో కొంతకాలం పాటు పనిచేశాడు. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఇటువైపు వచ్చిన అవసరాల.. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రాణిస్తున్నాడు.

రవిబాబు
సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా సినిమాల్లోకి వచ్చి.. నటుడిగా ఆ తర్వాత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సస్పెన్స్, థ్రిలర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రవిబాబు ఇంగ్లిష్ లిటరేచర్ చేశాడు. ఆ తర్వాత పుణెలోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు.

మోహనకృష్ణ ఇంద్రగంటి
మోహనకృష్ణ ఇంద్రగంటి లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్ యూనివర్సిటిలో ఇంగ్లిష్, ఫిలాసఫీ చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
సీక్రెట్ ఏజెంట్స్‌గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రేపటి నుంచే తెలంగాణలో సినిమా థియేటర్లు ఓపెన్
తల లేకుండా శ్రియని పరుగెత్తించిన వ్యక్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

