ఒకప్పుడు గూఢచారి తరహా సినిమాలు తెలుగులో చాలానే వచ్చేవి. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా అలాంటి సినిమాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు వరుసగా అలాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చంటబ్బాయి తర్వాత డిటెక్టివ్ జోనర్ దాదాపు తెలుగులో మాయం అయిపోయింది. మోహన్‌బాబు లాంటి వాళ్లు మధ్యలో డిటెక్టివ్ నారద అంటూ ప్రయత్నించినా కూడా ఫలితం తేడా కొట్టింది. ఇలాంటి సమయంలో నాలుగేళ్ల క్రితం ఈ జోనర్లో గూఢచారి సినిమాతో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు అడవి శేష్. ఇక రెండేళ్ల క్రితం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో నవీన్ పొలిశెట్టి కూడా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. దాంతో మళ్లీ ఆ తరహా కథలకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో స్పై కారెక్టర్స్ ఎక్కువైపోయారు. అలాంటి వాళ్లెవరో చూద్దాం..
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో నటించబోతున్నాడు అఖిల్.
ప్రవీణ్ సత్తారు సినిమాలో నాగార్జునతో పాటు కాజల్ కూడా స్పై తరహా పాత్రలోనే నటిస్తున్నారు.
నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్.. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇందులో ఆయన కూడా ఏజెంట్ పాత్రలోనే నటిస్తున్నాడు.
అడవి శేష్ మరోసారి గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సీక్వెల్ త్వరలోనే మొదలు కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
రీమేక్‌లపై కన్నేసిన బాలీవుడ్.. పరాయి కథలతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
విడుదలైన రెండేళ్ల తర్వాత ఖైదీ సినిమాపై కాపీ మరక