e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News రీమేక్‌ల‌పై క‌న్నేసిన‌ బాలీవుడ్‌.. ప‌రాయి క‌థ‌ల‌తోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు

రీమేక్‌ల‌పై క‌న్నేసిన‌ బాలీవుడ్‌.. ప‌రాయి క‌థ‌ల‌తోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు

బాలీవుడ్ త‌న పంథా మార్చుకుంటుంది. సొంత సినిమాల కంటే కూడా రీమేక్ సినిమాల‌పైనే ఎక్కువ శ్ర‌ద్ధ పెడుతోంది. అలా రీమేక్ చేసిన సినిమాలు చాలావ‌ర‌కు హిట్ అవుతుండ‌టంతో స్టార్‌ హీరోల‌తో పాటు నిర్మాత‌లు కూడా ప‌రాయి భాష‌ల క‌థ‌ల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం సౌత్ ఇండ‌స్ట్రీ నుంచే 10కి పైగా సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్ప‌టికే రెడీ, వాంటెడ్‌, క‌బీర్ సింగ్ వంటి సినిమాలు రీమేక్ అయి బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌నే కాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌నూ హిందీలోకి రీమేక్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే దుర్గ‌మ‌తి ( భాగ‌మ‌తి రీమేక్ ) వంటి సినిమాలు రీమేక్ అయి విడుద‌ల అవ్వ‌గా.. యూట‌ర్న్ వంటి సినిమాలు ప‌ట్టాలు ఎక్కుతున్నాయి. తాజాగా స‌మంత న‌టించిన యూట‌ర్న్ సినిమా రీమేక్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ రీమేక్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఏంటో ఒక‌సారి చూద్దాం..

U-టర్న్

క‌న్న‌డ‌లో యూట‌ర్న్ చిత్రం సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. జెర్సీ ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాల‌కు ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు ఇదే సినిమాను ఏక్తాక‌పూర్‌, శోభాక‌పూర్‌లు సంయుక్తంగా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు స‌మంత పోషించిన పాత్ర‌లో పూజా బేడీ కూతురు ఆలియా ఎఫ్ న‌టిస్తోంది. మంగ‌ళ‌వారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఆలియా ఎఫ్ గ‌తంలో జ‌వానీ జానేమ‌న్ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కూతురుగా న‌టించింది. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘించే వ్య‌క్తుల‌పై ఆర్టిక‌ల్ రాయాల‌ని ఓ మ‌హిళా జ‌ర్నలిస్టు ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో కొన్ని వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. వాటికి ఆ మ‌హిళా జ‌ర్న‌లిస్టే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తుంటారు. మ‌రి ఆ వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీ నుంచి ఆమె ఎలా త‌ప్పించుకుంది? ఆ హ‌త్య‌లు చేసింది ఎవ‌ర‌నేదే సినిమా క‌థాంశం.

ఛోరీ

- Advertisement -

సుస్ర‌త్ భ‌రోచా ప్రధాన పాత్ర‌లో మ‌రాఠీ హ‌ర‌ర్ చిత్రం ల‌పాచ్చ‌పి బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఛోరీ పేరుతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మూఢ న‌మ్మ‌కాలపై ఈ సినిమా ఉంటుంది. ఒక గ‌ర్భిణీ త‌న భ‌ర్త‌తో కొత్త ఇంటికి మారుతుంది. అక్క‌డ వారికి అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురవుతుంటాయి. వాటి నుంచి ఆ దంప‌తులు ఎలా త‌ప్పించుకున్నార‌నేదే ఈ సినిమా క‌థాంశం. ప‌లు అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ మ‌రాఠీ సినిమా ప‌లు అవార్డుల‌ను కూడా గెలుచుకుంది.

ఇంటర్న్

హాలీవుడ్ చిత్రం ది ఇంట‌ర్న్‌కు ఇది రీమేక్‌. ఆన్‌లైన్ ఫ్యాష‌న్ వెబ్‌సైట్‌లో సీనియ‌ర్ ఇంట‌ర్ప్‌గా మారిన ఏ 70 ఏళ్ల వ్య‌క్తికి.. ప‌నిత‌ప్ప వేరే ధ్యాస లేసి లేడీబాస్ మ‌ధ్య రిలేష‌న్‌పై ఈ సినిమా న‌డుస్తుంది. లేడీ బాస్ పాత్ర‌లో దీపికా ప‌దుకొణె, రిటైర్డ్ సీనియ‌ర్ ఉద్యోగిగా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. 2015లో వచ్చిన పీకూ తర్వాత మళ్లీ వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు.

మిమి

స‌రోగ‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌రాఠీ చిత్రం మ‌లా అయి వైచ్చి కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతుంది. ఈ సినిమాకు బెస్ట్ ఫీచ‌ర్ ఫిలింగా 2011లో జాతీయ అవార్డు కూడా వ‌చ్చింది. ఇదే సినిమా వెల్‌క‌మ్ ఒబామా పేరుతో 2013లో తెలుగులో రీమేక్ అయింది. కృతిస‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది.

అరువి

కొత్త నటీన‌టుల‌తో రూపొంది త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది అరువి. త‌న మొద‌టి సినిమా అయిన అదితి బాల‌న్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. 2018కి గానూ ఫిలింఫేర్‌, విజ‌య అవార్డుల‌తో పాటు ప‌లు సినీ అవార్డుల‌ను అందుకుందీ చిత్రం. ఈ సినిమా హిందీ రీమేక్‌లో దంగ‌ల్ ఫేమ్‌ అదితి బాల‌న్ పాత్ర‌లో ఫాతిమా స‌నా షేక్ న‌టిస్తోంది.

ఆర్య2

సుస్మితా సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో హాట్ స్టార్‌ ఓటీటీలో విడుద‌లైన ఆర్య వెబ్ సిరీస్ మంచి విజ‌యం సాధించింది. ఇది డ‌చ్ డ్రామా సిరీస్ అయిన పెనోజా ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పుడు దీనికి రెండో సీజ‌న్ రెడీ అవుతోంది. ఇందులోసూ సుస్మితాసేన్ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తుంది.

లూప్ ల‌పెటా

త‌న ప్రియుడి ప్రాణాల‌ను కాపాడేందుకు పోరాడే యువ‌తి క‌థ‌తో తెర‌కెక్కిన జ‌ర్మ‌న్ థ్రిల‌ర్‌ ర‌న్ లోలా ర‌న్ . 1998లో విడుద‌లైన ఈ సినిమా అప్పుడు మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమా క‌థ‌ను మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్చి లూప్ ల‌పెటాగా రీమేక్ చేశారు. ఈ సినిమాలో తాప్సీ, తాహిర్ రాజ్ భాసిన్‌లు న‌టించారు. ఈ సినిమా అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

హైద‌రాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్‌.. విడాకులు అందుకేనా?

బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజ‌మెంత‌?

ప‌వ‌న్ స‌ర‌స‌న మ‌ల‌యాళీ బ్యూటీ..!

థియేటర్స్ రీఓపెనింగ్‌..50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి

బాలీవుడ్‌లో భారీగా భ‌ర‌ణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెల‌బ్రెటీలు వీళ్లే

డేటింగ్ లో సారా అలీఖాన్..అత‌డెవ‌రో తెలుసా…?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana