హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
అమీర్ ఖాన్ విడాకులు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారాయి. ఫాతిమా సనా షేక్‌తో లింక్ ఉందని.. అందుకే కిరణ్‌రావుతో విడాకులు తీసుకుంటున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విడాకులు ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారాయి. దాదాపు 15 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు అకస్మాత్తుగా ఎందుకు విడిపోతున్నారనే దానిపై బాలీవుడ్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్‌తో లింక్ ఉందని.. అందుకే కిరణ్‌రావుతో విడాకులు తీసుకుంటున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ట్విటర్లో పెద్ద చర్చే జరుగుతోంది.

అప్పుడే మొదలైంది.
దంగల్ సినిమాలో ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ కుమార్తెగా నటించింది. ఆ తర్వాత వెంటనే అమీర్ ఖాన్‌తో మరో చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్లో అమీర్ సరసన నటించే అవకాశం దక్కడంపై అప్పట్లో పలు రూమర్లు వచ్చాయి. ఫాతిమాతో అమీర్‌కు ఎఫైర్ ఉందని.. అందుకే ఆమెకు రెండో సినిమాలో అవకాశం ఇచ్చాడని గుసగుసలు వినిపించాయి. ఆ సినిమా తర్వాత కూడా ఫాతిమా ముంబైకి వచ్చిన ప్రతిసారి అమీర్‌ను కచ్చితంగా కలుస్తుందని.. ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు వెళ్లేవారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి అంబానీ ఇంట్లో జరిగిన పార్టీకి, అవార్డుల వేడుల వద్ద కూడా వీళ్లు జోడీగా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కానీ అప్పట్లో ఆ వార్తలను అమీర్ ఖాన్ లైట్ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తన గురించి అలా తప్పుగా రాయడం సరికాదని చెప్పింది. అయితే ఇప్పుడు అమీర్‌ఖాన్ విడాకులు తీసుకుంటుండటంతో మరోసారి ఫాతిమా పేరు తెరపైకి వచ్చింది.

ఫాతిమా పుట్టింది హైదరాబాద్‌లోనే..
ప్రస్తుతం 29 ఏళ్లు ఉన్న ఫాతిమా హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లి రాజ్ తబుస్సుమ్ శ్రీనగర్‌కు చెందిన ముస్లిం. తండ్రి విపిన్ శర్మ కశ్మీర్‌కు చెందిన హిందూ. ఈమె చాచి 420, వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో బాలనటిగా నటించింది. నువ్వు నేను ఒకటవుదాం చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది. 2015లో విడుదలైన ఈ చిత్రం వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత దంగల్ సినిమాలో అవకాశం రావడంతో పాపులర్ అయిపోయింది.

అప్పుడు.. ఇప్పుడు 15 ఏళ్లకే విడాకులు
కిరణ్‌రావు కంటే ముందు రీనా దత్తాను అమీర్‌ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. 1986లో వీరి వివాహం జరిగింది. రీనాతో పెళ్లయిన 15 ఏళ్లకు ఆమె నుంచి విడిపోయాడు. ఆ తర్వాత 2005లో కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవనం తర్వాత ఇప్పుడు కిరణ్ రావుకు మరోసారి విడాకులు ఇచ్చాడు. 56 ఏళ్ల వయసున్న అమీర్‌ఖాన్.. 29 ఏళ్ల ఫాతిమాను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తపై ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
పవన్ సరసన మలయాళీ బ్యూటీ..!
థియేటర్స్ రీఓపెనింగ్..50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి
బాలీవుడ్లో భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

