బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?

బిగ్ బాస్ 5 తెలుగు గురించి రోజుకో కొత్త విషయం బయటికి వస్తూనే ఉంది. జులై నుంచే ఈ షో మొదలు కానుందని వార్తలు వినిపిస్తున్నా కూడా అదేం కాదు.. ఆగస్ట్ రెండో వారం నుంచి స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా యూ ట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ సహా మరో 10 మంది పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఈ సారి స్టార్ క్యాస్టింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. చాలా మంది కాంట్రవర్సీ పర్సన్స్ నే ఈ సారి షోలోకి పిలుస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సురేఖా వాణి లాంటి సీనియర్ నటీమణులను కూడా బిగ్ బాస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
వీళ్ళతో పాటు ఈ సారి ఎవరూ ఊహించని ఓ కంటెస్టెంట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. అతడే అలీ.. కమెడియన్ అలీ. ఇండస్ట్రీలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఈయన.. 1000 సినిమాలకు పైగానే నటించాడు. ఈయన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారు నిర్వాహకులు. కచ్చితంగా అలీ వస్తే షో రేంజ్ కూడా పెరుగుతుందని.. ఆయన లాంటి ఓ లెజెండరీ కమెడియన్ ఇంట్లోకి వెళ్తే టిఆర్పీ కూడా భారీగానే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాగైనా సరే అలీని ఒప్పించాలని కంకణం కట్టుకున్నారు స్టార్ మా యాజమాన్యం. దీనికోసం అలీకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఈ మధ్య అలీ ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. బుల్లితెరపైనే బిజీ అవుతున్నాడు. ఓ వైపు యమలీల సీరియల్ తో పాటు అలీతో సరదాగా లాంటి షోలు చేస్తున్నాడు. వీటికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ లోకి రావాలంటూ ఈయనకు ఆహ్వానం పలుకుతుంది స్టార్ మా. దానికోసం ఊహించని పారితోషికం కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి అలీ ఒప్పుకుంటాడా.. ఒకవేళ ఆయన కానీ వచ్చాడంటే కచ్చితంగా షో రేంజ్ మారిపోవడం మాత్రం ఖాయం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bigg boss5
- Comedian
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

