Mamata Banerjee | మమతా బెనర్జీకి షాక్.. పార్టీ సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల డుమ్మా
Mamata Banerjee : మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
Mamata Banerjee : మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. 20 మంది వరకు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఏకంగా ఈ సమావేశాన్ని రద్దు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం గురించి పార్టీ ఎమ్మెల్యేలకు ముందుగానే సమావేశం అందింది. టీఎంసీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ షోవన్దేవ్ ఛట్టోపాధ్యాయ్ అందరికీ సమావేశం గురించి చెప్పారు.
కోల్‌కతాలోని, కాలిఘాట్‌లో ఉన్న పార్టీ అధినేత్రి మమత నివాసంలో, ఆమె ఆధ్వర్యంలోనే ఆదివారం సమావేశం ఉంటుందని ఆయన అందరికీ చెప్పారు. 80 మంది ఎమ్మెల్యేలకు సమాచారం అందిస్తే.. 20 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు హాజరైన వారితో మమత కొద్దిసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై టీఎంసీ స్పందించింది. అభిషేక్ బెనర్జీపై శనివారం, కల్యాణ్ బెనర్జీపై ఆదివారం దాడి జరిగిన నేపథ్యంలో, తమ నేతలపై వరుసగా జరుగుతున్న దాడులకు భయపడి ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని పార్టీ అగ్రనాయకత్వం తెలిపింది. దీనంతటికీ కారణం బీజేపీనే అని విమర్శించింది.
అయితే, నిజంగానే ఎమ్మెల్యేలు దాడులకు భయపడి రాలేదా.. లేదా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఎంసీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కొందరు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. దీంతో టీఎంసీలో ఎంతమంది నేతలు కొనసాగుతారనేది అనుమానాస్పదమే. మరోవైపు బీజేపీ చేస్తున్న దాడులకు నిరసనగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ నేతలు ఆందోళన నిర్వహించనున్నారు. మమతా బెనర్జీ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

