Telangana BJP | ఈటెల vs అర్వింద్.. ‘నాపై ఎందుకు కడుపుమంట’ అంటూ ఫ్లెక్సీలు..!
Telangana BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి ఈటెల రాజేందర్ (Etela Rajender)ను లక్ష్యంగా చేసుకొని అతడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ వర్గం పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
Telangana BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి ఈటెల రాజేందర్ (Etela Rajender)ను లక్ష్యంగా చేసుకొని అతడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వర్గం పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈటల ఏడుపే బీజేపీకి శాపం, బీసీ నాయకులు ఎదుగుతుంటే ఎందుకంత అసహనం అంటూ మేడ్చల్‌లో చాలా చోట్ల ఫ్లెక్సీలు పెట్టారు అరవింద్ అనుచరులు.
ఈటెల రాజేందర్‌కు బీజేపీ చాలా చేసిందని.. అయినా ఆయన మాత్రం ఎప్పుడూ ఎంపీ అర్వింద్‌పై ఏడుస్తుంటారని ఫ్లెక్లీలు పెట్టారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు.. సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు.. కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలిచినా కూడా “నా ఇమేజ్ తోనే గెలిచాను” అనడం ఏ రాజకీయ నైతికత? అని ఈటలను ప్రశ్నించారు.
ఈటెల ఏడుపే బీజేపీకి శాపం!
తెలంగాణ బీజేపీలో ముసలం
ఈటెల వర్సెస్ అరవింద్
ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్
రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు
సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు
కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు
రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ… pic.twitter.com/dEbNT5T1k0
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2026
అంతేకాదు బీసీ నాయకులు ఎదుగుతుంటే ఈటెలకు అసహనం ఎందుకు? అని.. ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు? “నేనే బీసీ నాయకుడిని… నేనే ప్రత్యామ్నాయం” అనే భ్రమ నుంచి బయటకు రా ఈటెల అంటూ మేడ్చల్‌లో పలు చోట్ల ఎంపీ అరవింద్ వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

