GT vs RCB : స్పల్ప ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి గుజరాత్ టైటాన్స్ పేసర్లు షాకిచ్చారు. సిరాజ్ తన మూడో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్(32)ను పెవిలియన్ పంపగా.. పర్పుల్ క్యాప్ రేసులో ముందున్న రబడ డేంజరస్ పడిక్కల్(1)ను ఔట్ చేశాడు. రెండు వికెట్లు పడినా విరాట్ కోహ్లీ(35 నాటౌట్) ధనాధన్ ఆడడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 70 రన్స్ కొట్టింది.
ఫైనల్లో గుజరాత్‌ను 155కే కట్టడి చేసిన ఆర్సీబీ లక్ష్యం వైపు వడివడిగా అడుగులేస్తోంది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లువెంకటేశ్ అయ్యర్(32), విరాట్ కోహ్లీ(35 నాటౌట్) శుభారంభమిచ్చారు. రబడ ఓవర్లో 4, 6, 4, 4 బాదిన అయ్యర్ ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన విరాట్ అనంతరం రబడను లక్ష్యంగా చేసుకొని రెండు బౌండరీలు, సిక్సర్‌తో స్కోర్ 50 దాటించాడు.
Venkatesh Iyer ✅
Devdutt Padikkal ✅@gujarat_titans inducing spice in the #Final 🔥Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/YLhDf4iuZN
— IndianPremierLeague (@IPL) May 31, 2026
దంచేస్తున్న ఈ జోడీని సిరాజ్ విడదీసి తొలి బ్రేకిచ్చాడు. జట్టు స్కోర్ 62 వద్దఅయ్యర్ రబడ చేతికి దొరికాడు. తర్వాతి ఓవర్లోనే పడిక్కల్(1) గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద అర్షద్ ఖాన్ ఒడుపుగా అందుకున్నాడు. ఆర్సీబీ ఎండో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో చివరి బంతికి కోహ్లీ సిక్సర్ బాదగా ఆర్సీబీ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.