టాలీవుడ్ (Tollywood) యంగ్ రెబల్ స్టార్ నుంచి బాహుబలి సినిమా ఇచ్చిన క్రేజ్‌తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్ (Prabhas) ఈ స్టార్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). యూనివర్సల్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాధా కృష్ణకుమార్ (Radha Krishna Kumar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
జీ స్టూడియోస్ రాధేశ్యామ్ శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఊహించని విధంగా ఫ్యాన్సీ రేటుకు రైట్స్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తుండగా..ప్రస్తుతానికి ఆ ఫిగర్ ఎంత అనేది సస్పెన్స్ గా ఉంది. అంతేకాదు జీ స్టూడియోస్ పోస్ట్ థ్రియాట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా దక్కించుకున్నట్టు టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో లవర్ బాయ్‌గా, హస్తసాముద్రిక నిపుణుడిగా డిఫరెంట్ షేడ్స్ లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు ప్రభాస్. రాధేశ్యామ్ ట్రైలర్‌కు మిక్స్ డ్ టాక్ వస్తోంది.