పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న తాజా చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధా కృష్ణకుమార్ (Radha Krishna Kumar) డైరెక్షన్ లో రాబోతున్న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Radhe Shyam Pre release Event) లో సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ను లాంఛ్ చేశారు.
‘రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు..నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవ్..’అని ప్రభాస్ సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ‘దిగ్రేట్ విక్రమాదిత్య..నేనతడిని హస్త సాముద్రికానికి ఐన్స్టీన్ అని పిలుస్తా..’అంటూ విక్రమాదిత్య రోల్ గురించి రెబల్ స్టార్ కృష్ణం రాజు చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని కలుగజేస్తున్నాయి.
2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజవుతోంది.