Radha Krishna About Radhe Shyam | ‘రాధేశ్యామ్’ వెనుక 12-15 ఏళ్ల కథ…సస్పెన్స్ పెట్టిన డైరెక్టర్
ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి రాధేశ్యామ్ (Radheshyam). ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేశ్యామ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు రాధాకృష్ణకుమార్.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి రాధేశ్యామ్ (Radheshyam). రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాధేశ్యామ్ 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేశ్యామ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు రాధాకృష్ణకుమార్ .
ఇంతకీ ఆ కథేంటో..
ఈ సినిమా వెనుక 12-15 ఏళ్ల కథ ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయమేంటో మరోసారి చర్చిద్దామన్నాడు రాధాకృష్ణ. నేను ఈ కథపై వర్క్ చేశాను. అదే టైంలో ప్రభాస్ కూడా ప్రేమకథను చేసేందుకు ఆసక్తి చూపాడు. ఫైనల్‌గా అన్నీ కుదిరి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లింది. భావోద్వేగాలను తీసుకోవడంలో ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు. ప్రభాస్ లాంటి సెన్సిటివిటీ ఉన్న వ్యక్తే ఇలాంటి ప్రేమకథకు కావాలని అప్పటికపుడు అనిపించింది. ప్రభాస్ ఇమేజ్ ఈ సినిమాకు భారీ స్థాయిలో పనిచేస్తుందనుకున్నాం. ప్రభాస్‌ను ఇలాంటి చిత్రంలో చూడటం అభిమానులకు డబుల్ బొనాంజా అని చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ.
ప్రశంసగా భావిస్తున్నా..
కథ గురించి చెబుతూ..ఇది జీవన్మరణాల మధ్య పార్టీ లాంటిది. లోతైన భావాలు, భావోద్వేగాలతో సాగే లవ్ స్టోరీ. మనం సమాజంలో జీవిస్తున్నందున ఈ లవ్ స్టోరీకి జ్యోతిష్యాన్ని జోడిస్తే ఎలా ఉంటుందని ఈ సినిమా కోసం ఆలోచించానన్నారు. రాధేశ్యామ్ చిత్రాన్ని మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలితో పోల్చడంపై స్పందిస్తూ..అలాంటి క్లాసికల్ మూవీతో రాధేశ్యామ్‌ను పోల్చి చూడటం ప్రశంసగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. మొత్తానికి అన్ని విషయాలు చెప్పినట్టే చెప్పి ఇంతకీ ఆ 12-15 ఏళ్ల కథ ఏంటో చెప్పకుండా సస్పెన్స్ పెట్టేశాడు రాధాకృష్ణ. సినిమాపై క్యూరియాసిటీని పెంచేందుకే ఇలా చేశాడా..? లేదంటే దీనికి సంబంధించి సినిమాలో ఏమైనా హింట్ ఇస్తాడా..? అన్నది చూడాలి.
ఇప్పటికే రాధేశ్యామ్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

