కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే (Pooja Hegde)హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ స్టైలిష్ ఆఫ్ యాక్టింగ్ తో పక్కా వినోదాన్ని అందిచే ఎంటర్ టైనర్ లో నటించడంతో హ్యాపీగా ఫీలవుతోంది పూజాహెగ్డే. ఈ భామ బీస్ట్ సెట్స్ కు వెళ్లడం ఇదే చివరి రోజు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను ట్విటర్ ద్వారా అందరితో పంచుకుంది.
బీస్ట్ సినిమాకు పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాం. నెల్సన్ దిలీప్ కుమార్, విజయ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో వినోదాన్ని అందించడం పక్కా. సినిమా షూటింగ్ కొనసాగుతున్నంతసేపు వెకేషన్ వెళ్లినట్టనిపించింది. బాధాకరమైన విషయమేంటంటే ఇవాళ నాకు బీస్ట్ చివరి రోజు షూటింగ్. నేటితో నా పోర్షన్ షూటింగ్ అయిపోతుంది. థియేటర్లలో కలుద్దామంటూ వీడియో సందేశాన్ని ట్విటర్ లో పోస్ట్ చేసింది పూజాహెగ్డే.
It’s a wrap for @hegdepooja! Hear what she has to say about shooting for #Beast with #Thalapathy @actorvijay and director @Nelsondilpkumar pic.twitter.com/hz2mBhp7Do
— Sun Pictures (@sunpictures) December 10, 2021
బీస్ట్ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పూజా హెగ్డే చాలా కాలం తర్వాత బీస్ట్ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?