నేటి నుంచి పది పరీక్షలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరీక్ష రాయనున్న విద్యార్థులు 41,168
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 41,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
- నిర్ణీత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
రామగిరి, మార్చి 13 : పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 41,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకుగాను 180 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్ణత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి ఇస్తా రు. 9.35 గంటల తర్వాత ఎలాంటి అనుమతి ఉం డదు. పరీక్షలపై సందేహాలు, సూచనలు, ఫిర్యాదు ల కోసం డీఈవో కార్యాలయంలో పరీక్షల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు డీఈవో బొల్లారం భిక్షప తి, సూర్యాపేటలో డీఈవో అశోక్, యాదాద్రిభువనగిరి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ తెలిపారు.
హాజరయ్యే విద్యార్థులు
నల్లగొండ జిల్లాలో 106 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 19,835 మంది విద్యార్థులు, సూర్యాపేటలో జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,403 మంది విద్యార్థులు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,930 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
హెల్ప్ డెస్క్‌లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ఆయా డీఈవో కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా హెల్ప్‌డెస్క్ (కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంచారు.
నల్లగొండ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ – 9121212504
సూర్యాపేట జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ – 9848809754
యాదాద్రి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ – 9010772080
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

