ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో తీరిక లేకుండా బిజీగా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde) ..సరదాగా టూర్ వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్ మాల్దీవుల్లో (Maldives) విహరిస్తోందీ భామ. సాగరతీరాన సముద్ర అందాలను, ప్రకృతి సోయగాన్ని తనివి తీరా ఆస్వాదిస్తోంది. ఇటీవలే బికినీలో బీచ్ (Maldives Beach) లో చక్కర్లు కొడుతూ దిగిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.
తాజాగా మాల్దీవులు లొకేషన్ నుంచి మరో వీడియోను షేర్ చేసి నెటిజన్లకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది. ఫ్లోరల్ డిజైన్ టాప్, రౌండ్ క్యాప్, వైట్ ప్యాంట్లో ఉన్న పూజాహెగ్డే హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బీచ్ వైపు నడుచుకుంటూ వచ్చి..బికినీలోకి ట్రాన్స్ ఫార్మేషన్ అయిన వీడియోను సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
Up up and away…. ✈️ #traveldiaries #gypsiesoul pic.twitter.com/O67M5qFRdE
— Pooja Hegde (@hegdepooja) November 18, 2021
Up up and away అంటూ క్యాప్షన్ ఇచ్చింది. #traveldiaries హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. సాగరతీరంలో స్విమ్మింగ్ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తోన్న వీడియో ఇపుడు ఆన్లైన్లో హల్ చల్చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో రాధేశ్యామ్, విజయ్‌తో బీస్ట్ చిత్రాల్లో నటిస్తోంది పూజాహెగ్డే. పలు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde saree | పూజాహెగ్డే చీర ఖరీదు తెలిస్తే షాకే..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక