Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ప్రభాస్‌కు అభిమానులంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉంటాడు యంగ్ రెబల్ స్టార్.

బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ఈ చిత్రం ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఇక ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రభాస్‌కు ఫ్యాన్ (Prabhas Fan) ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్‌కు అభిమానులంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉంటాడు యంగ్ రెబల్ స్టార్.
సాధారణంగా యాక్లర్లు తమ డైరెక్టర్లకు, సహనటీనటులకు, స్నేహితులకు బహుమతులు ఇవ్వడం చూస్తుంటారు. అయితే ఈ సారి ప్రభాస్ ఓ అడుగు ముందుకేసి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ప్రభాస్ ఓ వ్యక్తికి అదిరిపోయే వాచ్‌ను (Luxury Watch)కానుకగా ఇచ్చాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏ ఫేమస్ సెలబ్రిటీ అయి ఉంటారోనని ఆలోచిస్తున్నారా..? అవును మీరు ఆలోచిస్తుంది నిజమే. ప్రభాస్ నుంచి కానుక అందుకున్న వ్యక్తి జనాలకు సెలబ్రిటీ కాకపోవచ్చు. ప్రభాస్‌కు మాత్రం సెలబ్రిటీ లాంటి వ్యక్తే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. ఇంకెవరో కాదు ప్రభాస్ వీరాభిమాని. ప్రభాస్‌కు అభిమానులకన్నా గొప్ప వ్యక్తులెవరున్నారు చెప్పండి.
ప్రభాస్‌కు వీరాభిమాని అయిన ఓ వ్యక్తి ఇటీవలే గుండు గీయించుకున్నాడు. అది కూడా ప్రభాస్ పేరు మాత్రమే వచ్చేలా వెంట్రుకలను డిజైన్ చేయించుకున్నాడు. ఈ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేయగా..అవి ప్రభాస్ కంట్లో పడ్డాయి. అతడెవరో తెలుసుకున్న ప్రభాస్ ఆ అభిమానిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. అభిమానితో కలిసి సరదాగా మాట్లాడాడు. అతడికి ఖరీదైన లగ్జరీ వాచ్‌ను బహుమతిగా అందించి షాకిచ్చాడు. ఇక తాను ఎంతగానో ఆరాధించే ఫేవరేట్ యాక్టర్ ఇలా ఇంటికి పిలిపించుకోవడమే కాకుండా ఖరీదైన కానుక ఇవ్వడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం రాధేశ్యామ్‌తోపాటు ఆదిపురుష్, ప్రాజెక్టు కే, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

