Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబసభ్యులు (Sushant Singh Rajput family) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) కుటుంబంలో విషాదాలు ఆగడం లేదు. ఆయన మరణించిన విషయాన్నే చాలా రోజుల వరకు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతలోనే ఆయన పెద్దక్క గీతా సింగ్ మరణించారు. ఆమె మరణం కూడా అందర్నీ కలిచివేసింది. ఇప్పుడు ఏకంగా ఆ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హర్యానా సీనియర్ పోలీసు అధికారి, సుశాంత్ సింగ్ బావ OP సింగ్ సోదరి గీతా దేవి అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు పాట్నా నుంచి తిరిగొస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బీహార్ లఖి సరాయ్ జిల్లాలోని 333వ నంబర్ జాతీయ రహదారి మీదుగా సుశాంత్ కుటుంబ సభ్యులు వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందగా..నలుగురికి గాయాలయ్యాయి.
గాయాలైన వారిలో బల్ముకుంద్ సింగ్, దిల్ ఖుష్ సింగ్‌ను చికిత్స నిమిత్తం పాట్నాలోని ఆస్పత్రికి తరలించగా..బాల్మీకి సింగ్, టోను సింగ్‌ను లఖిసరాయ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాట్నాలో సీనియర్ హర్యానా పోలీసాఫీసర్ ఓపీ సింగ్ (సుశాంత్ సింగ్ బావ) సోదరి గీతా దేవి అంత్యక్రియలకు హాజరై..తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా సమీపంలో మిడిల్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై లఖిసరాయ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. ఒక ట్రక్కు, సుమో [SUV] మధ్య జరిగిన ప్రమాదం అని తెలిపారు. అందులో 10 మంది వ్యక్తులు ఉన్నారని.. పాట్నా నుంచి తిరిగి వస్తున్న సమయంలో జరిగిందని తెలిపాడు. ఈ ప్రమాదంలో సుమో డ్రైవర్‌తో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా..గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

గాయపడిన వాళ్లలో బల్ముకుంద్ సింగ్, దిల్ ఖుష్ సింగ్‌లను మెరుగైన చికిత్స కోసం పాట్నాకు పంపగా, మిగిలిన బాల్మీకి సింగ్, టోను సింగ్‌లను లఖిసరాయ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చనిపోయిన వాళ్లలో లాల్జిత్ సింగ్ (ఓపీ సింగ్ బావ), అతని ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్ అలియాస్ నేమని సింగ్, రామ్ చంద్ర సింగ్‌లుగా గుర్తించారు. మిగిలిన వాళ్లను బేబీ దేవి, అనితాదేవి, డ్రైవర్ ప్రీతం కుమార్‌గా గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

