Karuppu | తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కరుప్పు చుట్టూ కొత్త వివాదం చెలరేగింది. ఈ సినిమాను దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం సినిమా విడుదలకు ముందే కొన్ని వివాదాస్పద వార్తలు బయటకు రావడంతో తమిళ సినీ పరిశ్రమలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశను పూర్తిచేసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదలకు సంబంధించిన అంశాల్లో ఆలస్యం జరుగుతుండటంతో దర్శకుడు మరియు నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు ఆర్జే బాలాజీ సినిమా నిర్మాత , హీరోపై కేసు వేయడానికి సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమా పూర్తయినా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కావాలనే విడుదలను ఆలస్యం చేస్తున్నారని దర్శకుడు అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పారితోషకం విషయంలో కూడా మేకర్స్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ కారణాల వల్లే దర్శకుడు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై సినిమా నిర్మాతల నుంచి మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని వారు చెబుతున్నట్లు సమాచారం. దర్శకుడు ఆర్జే బాలాజీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, కావాలనే కొందరు ఇలాంటి రూమర్లను సృష్టిస్తున్నారని నిర్మాతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా విడుదల విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. ప్రస్తుతం సినిమా విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయని, సరైన సమయం చూసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉందని అంటున్నారు. మొత్తం మీద “కరుప్పు” సినిమాపై వచ్చిన ఈ వివాద వార్తలు ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అయితే నిజంగా దర్శకుడు కేసు వేయనున్నాడా? లేక ఇవన్నీ కేవలం రూమర్లేనా? అన్న విషయం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.