యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ హీరో బాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు. అయితే సౌత్ నుండి నార్త్ కి చేరుకుని అక్కడున్న స్టార్స్ కి సమానంగా క్రేజ్ ని సంపాదించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసిన ప్రభాస్ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.
సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డ్ ప్రభాస్ సాధించాడు. ప్రస్తుతం నంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ ఎంపికయ్యారు. దీంతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది. యూకే దేశంలో ఈస్టర్న్ ఐ వీక్లి అనే వెబ్ సైట్ చేసిన సర్వేలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించారు. అటు మీడియాతో పాటుగా ఇటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ఫేమస్ ఈస్టర్న్ ఐ వీక్లి సెలక్ట్ చేస్తే.. ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.
సినిమా సినిమాకు తన క్రేజ్ ని పెంచుకుంటున్నారు ప్రభాస్. విభిన్నమైన కథల్ని సెలెక్ట్ చేసుకోవడంలో ప్రభాస్ ప్రథమస్థానంలో ఉంటారు. ఇక విలక్షణమైన పాత్రల్లో నటించాలంటే దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతుండగా ఇందులో సలార్, ఆదిపురుష్. ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.