– హాజరైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 23 : కొత్తగూడెం కార్పొరేషన్లో గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కమిషనర్ సుజాత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు, మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి హాజరయ్యారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సింధు తపస్వి. మల్లెల స్వప్న, వీరమ్మ, భీమా శ్రీవల్లి, మల్హోత్రా సాగర్, మధు చంద్, గుణ చరిత, రాంబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాపు సీతాలక్ష్మి, మంతపురి రాజు గౌడ్, శ్రీధర్, కనకేష్ పటేల్, రమాకాంత్, దామోదర్ పాల్గొన్నారు.

కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం