Sreeleela | శ్రీలీలని పలకరిస్తున్న వరుస ఫ్లాపులు..అయిన కూడా ఏకంగా స్టార్ హీరో సరసన ఛాన్స్?
Sreeleela |సౌత్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో అచ్చ తెలుగమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఎనర్జీ, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తక్కువ సమయంలోనే ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. రవితేజతో చేసిన ధమాకా ద్వారా తెలుగులో తొలి భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, హిట్లు–ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది.
Sreeleela |సౌత్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో అచ్చ తెలుగమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఎనర్జీ, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తక్కువ సమయంలోనే ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. రవితేజతో చేసిన ధమాకా ద్వారా తెలుగులో తొలి భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, హిట్లు–ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది. తన టాలెంట్‌తో నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ కమర్షియల్ సినిమాల్లో ప్రత్యేక ఇమేజ్ను నిర్మించుకుంది. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన శ్రీలీల, మాస్ ఎంటర్టైనర్ల నుంచి లవ్ స్టోరీల వరకు విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను విస్తరించుకుంటోంది.
ఇదే సమయంలో కోలీవుడ్‌పైనా దృష్టి సారించింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, అక్కడ కూడా అవకాశాలు అందుకుంటోంది. ఇక తాజాగా ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘D55’ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వండ్ బార్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌లో తన స్థానం మరింత బలపరచుకోవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్గా ఎంపికయ్యే అవకాశముందని టాక్ నడుస్తోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత రేసింగ్‌పై దృష్టి పెట్టిన అజిత్, అదే చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో మరోసారి చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో అజిత్‌కు సమానంగా బలమైన మహిళా పాత్ర ఉండేలా కథను డిజైన్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ పాత్ర కోసం శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే, శ్రీలీల కెరీర్లో ఇది కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో అజిత్–శ్రీలీల కాంబినేషన్‌పై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ajith
- Box office
- flops
- Robinhood
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

