T20 World Cup : లీగ్ దశలో ఓటమెరుగని భారత జట్టు(Team India) కీలకమైన సూపర్ 8లో మాత్రం ఘోరంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా టాపార్డర్ జోరుకు కళ్లెం వేసి.. మధ్యలో పట్టు సడలించి.. ఆఖర్లో పంజా విసిరిన టీమిండియా.. ఛేదనలో మాత్రం తేలిపోయింది. 188 పరుగుల లక్ష్యాన్ని ఉ ఫ్ మనిపిస్తుందనుకుంటే.. సమిష్టి వైఫల్యంతో సఫారీలకు సరెండరైంది. ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ సేన పోరాడకుండానే మ్యాచ్‌ను అప్పగించేసిందనే బాధ అభిమానులను వెంటాడుతోంది. 76 పరుగుల తేడాతో ఓడిన కారణంగా నెట్ రన్‌రేటు మైనస్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరడంపై సందిగ్ధం నెలకొంది.
గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్‌గా సూపర్ 8లో అడుగుపెట్టిన భారత జట్టును నేలకు దించింది దక్షిణాఫ్రికా. ప్రస్తుతం భారత్ నెట్‌రన్‌రేటు మైనస్(-3.800)లో ఉంది. చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ అవకాశాలుంటాయి. ఫిబ్రవరి 26న చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో.. మార్చి 1న వెస్టిండీస్‌తో సూర్యకుమార్ సేన తలపడనుంది.
Hey @grok predict which four teams will make it to the semifinals from Super 8 Group 1 and Super 8 Group 2 🏏🔥#T20WorldCup pic.twitter.com/psHgvABBW6
— ScoreBoll (@scoreboll) February 23, 2026
ఈ రెండు జట్లను ఓడిస్తే నాలుగు పాయింట్లతో టీమిండియా రేసులో ఉంటుంది. కానీ, లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కెప్టెన్ సికిందర్ రజా.. పేసర్లు ముజరబని, ఎవాన్స్, స్పిన్నర్ గ్రీవ్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సెమీస్‌పై కన్నేసిన ఆఫ్రికా జట్టును ఓడించడం అసాధ్యమని చెప్పలేం కానీ.. సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యమవుతుంది.
The first time India lost by a margin of 50+ in the competition… pic.twitter.com/h5GfnwOkWa
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
అలానే.. వెస్టిండీస్ సైతం సమిష్టిగా రాణిస్తూ మాతో కష్టమే హెచ్చరికలు పంపుతోంది. షాయ్ హోప్ సారథ్యంలో ప్రమాదకరంగా పరిణమిస్తున్న విండీస్.. మూడో కప్ వేటలో పక్కాగా ఆడుతోంది. లీగ్ దశలో ఇంగ్లండ్‌ను ఓడించిన కరీబియన్ జట్టుపై భారత్‌కు మెరుగైన రికార్డే ఉంది. సో.. కచ్చితంగా ఓడిస్తేనే టీమిండియాకు సెమీస్ అవకాశాలుంటాయి. రెండుకు రెండు గెలవడమే కాకుండా దక్షిణాఫ్రికా తదుపరి మ్యాచుల ఫలితాలు కూడా కీలకం కానున్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్‌తో సఫారీ టీమ్ ఓడాలి. అప్పుడు సూర్యకుమార్ సేన సెమీస్ బెర్తుకు దగ్గరవుతుంది. ఒకవేళ.. సఫారీ టీమ్ రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే.. గ్రూప్ ఏ నుంచి రెండో స్థానం కోసం జింబాబ్వే, విండీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీ20 వరల్డ్‌కప్ బరిలో నిలిచిన భారత జట్టు అంచనాలకు తగ్గట్టే లీగ్ దశను అజేయంగా ముగించింది. నాకౌట్లోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ప్రపంచకప్‌లో సఫారీలపై 5-2 విజయాల రికార్డు ఉంది. కానీ, అహ్మదాబాద్‌లో భారత క్రికెటర్ల ఆట లయ తప్పింది.
అక్షర్ పటేల్‌ను తప్పించి తుది జట్టులోకి సుందర్‌ను తీసుకోవడం బెడిసికొట్టగా.. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ డకౌటవ్వడం.. ఆపై యాన్సెన్ తొలి బంతికే తిలక్ వర్మను వెనక్కి పంపడంతో భారత్ ఒత్తిడిలో పడింది. 6, 4తో టచ్‌లోకి వచ్చినట్టే కనిపించిన అభిషేక్ శర్మ సైతం పవర్ ప్లేలోనే వెనుదిరిగాడు. చూస్తుండగానే మూడు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్ ఝులిపించి ప్రొటీస్ బౌలర్లపై పైచేయి సాధించలేదు.
Between the two defeats in Ahmedabad, India won a record 17 completed matches pic.twitter.com/QiXEtX8P0e
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
South African Shutdown 👊 pic.twitter.com/gbzT2G2Okq
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
బుమ్రా, అర్ష్‌దీప్ విజృంభణతో 20కే మూడు వికెట్లు పడిన సఫారీ టీమ్‌ను డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసక ఆటతో ఆదుకున్నట్టు సూర్య, పాండ్యా భారత్‌ను గట్టెక్కించలేదు. వీరూ పెద్ద షాట్లకు యత్నించక సింగిల్స్ తీస్తూ ఉండడంతో మ్యాచ్ చేజారుతూ వచ్చింది. వీరిద్దరూ ఔటయ్యాక రింకూ సింగ్ సిక్సర్‌తో ఆశలు రేపినా.. తర్వాత బంతికే వికెట్ ఇచ్చేశాడు. వరల్డ్‌కప్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఈ ఐపీఎల్ స్టార్ ఆదుకుంటాడనుకుంటే ఉసూరుమనిపించాడు. శివం దూబే(43) ఒంటరి సైనికుడులా పోరాడినా సరిపోలేదు. ఫలితంగా.. 111కే కుప్పకూలిన టీమిండియా.. 76 పరుగుల తేడాతో ఓడింది.