ట్రిపుల్ ఆర్తో పాటు ఆ సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి..

SS Rajamouli | రాజమౌళి.. ఈ పేరుకు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా రాజమౌళి క్రేజ్ కోసం పాకులాడుతున్నారు. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని వినగానే మరో అనుమానం లేకుండా వెంటనే గుర్తుకు వచ్చే పేరు దర్శక ధీరుడు జక్కన్నదే. బాహుబలి సినిమా తర్వాత ఈయన రేంజ్ ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తరువాత ఏకంగా రాజమౌళి కోసం బాలీవుడ్ నిర్మాతలు వందల కోట్లు పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అయిపోయారు. అయినా కూడా ఈయన మాత్రం తెలుగు ఇండస్ట్రీకే పరిమితమయ్యారు. ఇక్కడి నుంచే పాన్ ఇండియా సినిమాలు చేసి బాలీవుడ్ వైపు వెళ్తున్నాడు.
సినిమాలో హీరో ఎవరు ఉన్నా ఫర్వాలేదు రాజమౌళి పేరు కనిపిస్తే చాలు అన్ని ఇండస్ట్రీల్లో ప్రేక్షకులు ఇప్పుడు వాటి కోసం ఎగబడుతున్నారు. ఈ క్రేజు వాడుకోవడానికి అన్ని ఇండస్ట్రీల వాళ్లు రాజమౌళి వెంట పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సైడ్ బిజినెస్ కూడా బాగానే ఉంది. ఒక వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నాడు రాజమౌళి. తాజాగా బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్రలో భాగంగా మారాడు రాజమౌళి. ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ వెర్షన్స్ కు సమర్పకుడిగా ఉన్నాడు రాజమౌళి. దాంతో పాటు వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు దర్శకధీరుడు. వాటి నిర్మాణంలో కూడా భాగం అవుతున్నాడు జక్కన్న. ఒకవైపు ట్రిపుల్ ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తూనే.. ఇంకోవైపు బాలీవుడ్ బ్రహ్మాస్త్రతో పాటు పరంపర అనే వెబ్ సిరీస్ కూడా ప్రమోట్ చేస్తున్నాడు. ఎలా చూసుకున్నా కూడా రాజమౌళి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఇక దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా జనవరి 7, 2022న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే..
బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? హౌజ్‌మేట్స్ అనుకున్నది ఒకరిని.. అక్కడ జరుగుతున్నది మరొకటి..
టాలీవుడ్, బాలీవుడ్ తారలను ఒక్క దగ్గరికి చేర్చిన బిగ్‌బాస్
Who is biggboss 5 Telugu winner | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
BB Telugu Grand Finale | అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మొదలైన బిగ్ బాస్ 5 ఫినాలే..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

