Bigg boss 5 Grand Finale | బిగ్ బాస్ 5 ఫినాలే అద్భుతంగా మొదలైంది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్.. తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఫినాలే ఎపిసోడ్‌ను ఓ రేంజిలో మొదలుపెట్టారు. ఎవరికి వారు డ్యాన్సులతో కుమ్మేవారు. ముఖ్యంగా నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులతో స్టేజిపై డాన్స్ చేశారు నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్. ఇద్దరి డాన్స్ పర్ఫార్మెన్స్ ఆరంభంలోనే అదిరిపోయింది. ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అద్భుతమైన డాన్సులతో కుమ్మేశారు కంటెస్టెంట్స్. చిన్నదో వైపు పెద్దదో వైపు అంటూ అటు ప్రియాంక ఇటు శ్వేతతో సూపర్ డ్యాన్సులు వేశాడు జెస్సీ. మరోవైపు ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ అంటూ అల్లు అర్జున్ పాటకు డాన్స్ పిచ్చెక్కించాడు. అదే పాటకు హమీద కూడా అదిరిపోయే డ్యాన్సులు చేసింది.
చాలా రోజుల తర్వాత వీళ్లందరూ ఒకే స్టేజిపై కనిపించడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇక నాగార్జున కూడా అందరినీ ఆప్యాయంగా పలకరించాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడిగాడు. నటరాజ్ మాస్టర్ హీరోగా నటిస్తున్నాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు నాగార్జున. అలాగే లోబోకు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలుసుకొని సంతోషించాడు. అలా ప్రతి ఒక్కరిని పలకరించి మరోసారి వాళ్ల అందరితో ముచ్చటించి మంచి చెడ్డలు తెలుసుకున్నాడు నాగార్జున.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 Grand Finale | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
ఎక్కడో బహ్రెయిన్‌లో పుట్టిన మమతా మోహన్‌దాస్.. సౌత్‌లో హీరోయిన్ ఎలా అయ్యింది?
parampara in OTT | హాట్‌స్టార్ ఓటీటీలో పరంపర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?